హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ మాజాకా: వెటర్నరీ డాక్టర్‌కు న్యాయం చేయమని కోరుతుంటే.. పెళ్లిలో సారు బిజీ...

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్‌పై సాముహిక లైంగికదాడి, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయ్. యువత, ప్రముఖులు ముక్తకంఠంతో ఘటనను ఖండిస్తున్నారు. బాధితురాలి ఆత్మ శాంతించాలంటే నిందితులకు ఉరి శిక్ష సరైనదని డిమాండ్ చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. హై ప్రొఫైల్ పెళ్లికి హాజరయ్యారు.

సమ్మె కాలానికి జీతం ఇస్తాం: పదవీ విరమణ వయసు 60కి పెంపు : ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు..!సమ్మె కాలానికి జీతం ఇస్తాం: పదవీ విరమణ వయసు 60కి పెంపు : ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు..!

సమయం లేదా..?

సమయం లేదా..?

సీఎం కేసీఆర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ ఘటనపై స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా.. ఇష్యూపై కేసీఆర్ నోరుమెదపలేదు. దీంతో జాతీయస్థాయిలో కేసీఆర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన ఊరికేం ఏం లేరు. ముఖ్యమైన పెళ్లిళ్లకు హాజరై.. వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.

పెళ్లికి మాత్రం..

పెళ్లికి మాత్రం..

తన క్యాబినెట్ సహచర మంత్రి రేఖా నాయక్ కూతురు వివాహానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి.. గ్రూప్ ఫోటో కూడా దిగారు. పెళ్లిళ్లకు వెళ్లే సమయం ఉంటుంది.. కానీ, ఘటనపై స్పందించే టైం కేసీఆర్ ఉండదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఒక్కరే కాదు ఆయన బలగం మొత్తం విందుకు హాజరయ్యారు. ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా హాజరై ఫోటోలకు ఫోజిచ్చారు.

నేతలకు నో ఎంట్రీ..

నేతలకు నో ఎంట్రీ..

ఓ యువతి హత్యకు గురైన సందర్భంలో చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సరికాదని.. తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. ఆదివారం వెటర్నరీ వైద్యురాలు పేరెంట్స్‌ను పరామర్శించేందుకు నేతలు వెళితే పరాభావం ఎదురైంది. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

న్యాయం చేయరు..

న్యాయం చేయరు..

యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ కేంద్రమంత్రి సంజీవ్ బాల్యన్ మాత్రం వెటర్నరీ వైద్యురాలి పేరెంట్స్‌ను పరామర్శించారు. ఇదివరకే గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా శ్రీధర్ రెడ్డి దంపతులను ఓదార్చారు.

English summary
cm kcr not reacted on Veterinary doctor raped and murdered issue. criticize kcr behaviour on this particular issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X