హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో విమానం.. గాల్లోనే చక్కర్లు.. శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : టేకాఫ్ అయిన తర్వాత విమానాల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం సాధారణం. ఆ క్రమంలో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టమే. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి పరిస్థితే కనిపించింది. పైలట్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే గాల్లో చక్కర్లు కొట్టింది. అటు ముందుకు పోలేక.. ఇటు కిందకు దిగలేక అలా చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణీకులు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.

 indigo flight technical issue not moved for destination in shamshabad

మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)

ఆ విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు కిందకు దించే వీలులేకపోవడంతో అలా కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. చివరకు అంతా ఓకే అనుకున్న తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ చేశారు. మొత్తానికి సేఫ్‌గా విమానం కిందకు దిగడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Shortly after takeoff, IndiGo flight from Shamshabad airport to Bangalore faced technical problems. The passengers were in tension as they were unable to move forward. They panicked, not knowing what was going on. At last, the flight landed safely in shamshabad airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X