• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సుప్రీం కోర్టులో ఇంటర్ కేసు కొట్టివేత.!ఎర్ర మంజిల్ కూల్చివేత పట్ల ప్రభుత్వానికి హైకోర్ట్ మొట్టికాయలు

|

ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని కొండలరావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయమై హైకోర్టులో వేసిన దావాను కూడా కొట్టి వేశారు కదా అని సుప్రీం తెలిపింది. ఇటీవల తెలంగాణలో విడుదలైన ఇంటర్‌ ఫలితాలు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై కేసు..! పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!!

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై కేసు..! పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!!

పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవండతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఆందోళనలు చేపట్టారు. జిల్లాల వ్యాప్తంగానూ ఆందోళనలు మిన్నంటాయి. తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగం మాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసందే. పిటిషన్‌ను జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఎర్రమంజిల్ ను కూల్చొద్దు..! మళ్లీ ఉత్తర్వులిచ్చేవరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్ట్..!!

ఎర్రమంజిల్ ను కూల్చొద్దు..! మళ్లీ ఉత్తర్వులిచ్చేవరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్ట్..!!

టీ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను తమ ఉత్తర్వులు వెల్లడించేంత వరకు కూలచొద్దన్న హైకోర్టు చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి ఆదేవాలు జారీ చేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై విచారణ ప్రారంభం కాగానే కౌంటర్ కు 15 రోజులు గడువు కోరారు ప్రభుత్వ న్యాయవాది. అయితే ఇవాళ మధ్యాహ్నం 2.15 కే వాదనలు వినిపిస్తామన్న ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్, సచివాలయ భవనాల కూల్చివేత తుది విచారణ ఇవాళ మద్యాహ్న్నానికి వాయిదా వేసింది హైకోర్ట్.

కూల్చివేతలను అడ్డుకుంటామన్న అఖిల పక్షం..! ఏకమైన అన్ని పార్టీలు..!!

కూల్చివేతలను అడ్డుకుంటామన్న అఖిల పక్షం..! ఏకమైన అన్ని పార్టీలు..!!

ప్రస్తుత సచివాలయాలన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోం.. అడ్డుకుంటాం అని అఖిల పక్షాలు హెచ్చరించాయి. కొత్తగా భవనాలను కట్టాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని కూడగట్టి ఉద్యమించాలని నిర్ణయించాయి. కూల్చివేతపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలేది లేదని స్పష్టం చేశాయి. జి.వెంకటస్వామి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో 'సచివాలయం కూల్చివేత - కొత్త అసెంబ్లీ నిర్మాణం' పై అఖిలపక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ జి.వివేక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీజేపి, టీడిపి, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీల నాయకులు, వివిధ సంస్థలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కూల్చివేతలపై న్యాయపోరాటం ఆగదు..! తేల్చిచెప్పిన రాజకీయ నేతలు..!!

కూల్చివేతలపై న్యాయపోరాటం ఆగదు..! తేల్చిచెప్పిన రాజకీయ నేతలు..!!

సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని సోమవారం గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అన్ని పార్టీల నాయకులు గవర్నర్‌ను కలిసి, ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి చారిత్రక కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలని తీర్మానించారు. ప్రజాసమస్యలు, వారి అవసరాలను తీర్చడానికి ఐక్య పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Inter-Student Suicides In Supreme Court Supreme Court dismisses Telangana Inter Students' petition A man named Kondalarao has filed a petition in the Supreme Court alleging that students have committed suicide due to irregularities in the recently released inter results. The Supreme Court dismissed the petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more