• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?

|

హైదరాబాద్‌ : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. నటులు కావాలని వచ్చేవాళ్లల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి నిరాశ మిగులుతుంది. ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడుతూ వెయిట్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అవకాశం రాకపోతుందా అని ఎంతకాలమైనా ఎదురుచూస్తూనే ఉంటారు. అలా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు సినిమా నటుడవ్వాలనే ఆశతో ముంబయికి వెళ్లి.. నిజ జీవితంలో విలన్ గా ముద్ర వేసుకున్నాడు.

నటుడు కావాలని.. ఇంట్లో చెప్పకుండా..!

నటుడు కావాలని.. ఇంట్లో చెప్పకుండా..!

హైదరాబాద్ పాతబస్తీ కామాటీపురకు చెందిన ఇసాక్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. సినిమాల్లో నటించాలనే కోరిక అతడ్ని ఒక్కచోట నిల్చోనివ్వలేదు. నాలుగు సంవత్సరాల కిందట ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబయి వెళ్లిపోయాడు. అలా నాలుగేళ్లుగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ సైడ్ యాక్టర్ వేషం కూడా దొరకలేదు. దాంతో చాలా నిరాశ చెందాడు. ఏంచేయాలో తెలియలేదు.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు.

కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో సిగ్గుగా అనిపించి తిరిగి ఇంటికి రాలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో క్రమక్రమంగా మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. అంతేకాదు జీవించడానికోసం ముంబయిలోని ఓ డ్రగ్స్ ముఠాతో జతకట్టాడు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ స్మగ్లర్‌గా చలామణీ అవుతున్నాడు.

 రాజకీయాల్లో అంతే : అప్పుడు విడిపోయిన దంపతులు.. ఇప్పుడు కలిపిన ఎంపీటీసీ ఎన్నికలు రాజకీయాల్లో అంతే : అప్పుడు విడిపోయిన దంపతులు.. ఇప్పుడు కలిపిన ఎంపీటీసీ ఎన్నికలు

డ్రగ్స్ స్మగ్లర్‌గా అవతారం

డ్రగ్స్ స్మగ్లర్‌గా అవతారం

డ్రగ్స్ స్మగ్లర్‌గా తన నేర సామ్రాజ్యం విస్తరించుకున్నాడు ఇసాక్. ఆ క్రమంలో సొంత ఇలాకా హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయించేందుకు హెరాయిన్ తీసుకుని నగరంలో వాలిపోయాడు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇసాక్ ఉన్న చోట దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు.

ఇసాక్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రగ్స్ అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 28 గ్రాముల హెరాయిన్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గ్రాము హెరాయిన్ విలువ దాదాపు 11వేల రూపాయలు ఉంటుందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

 అసలోడిని పట్టుకొస్తే.!

అసలోడిని పట్టుకొస్తే.!

ఇసాక్ ముఠాపై మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నామని చెప్పారు సీపీ. హైదరాబాద్ లో ఈ గ్యాంగ్ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోందనే విషయాలు సేకరిస్తామన్నారు. అలాగే ముంబయికి చెందిన డ్రగ్స్ స్మగ్లర్ ఉస్మాన్ షేక్ ను అరెస్ట్ చేస్తే ఈ అంతర్ రాష్ట్ర డ్రగ్స్ గ్యాంగ్ వ్యవహారం మొత్తం బయటపడే ఛాన్సుందన్నారు.

English summary
Interstate Drugs gang arrested by cyberabad police in hyderabad. Among the five members, the person named isak belongs to hyderabad old city area. He went to mumbai four years ago for cinema opportunities. He didnt get cinema chances, then he turned and earning as drugs smuggler. The police were seized 28 grams Heroin and 5 mobiles from the gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X