హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ బోర్డు తప్పులు కనిపిస్తున్నా , మంత్రి నమ్మారా ? బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న జగదీశ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఓవైపు ఇంటర్ విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళన చేస్తుంటే సంబంధిత విధ్యాశాఖ మంత్రి మాత్రం నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారు. పరీక్షలు అన్న తర్వాత ఫెయిల్ కాకుండా ఉంటారా అంటూ స్పందిస్తున్నారు. తమ ప్రభుత్వం లోనే తప్పులు జరిగినట్టు చూపిస్తున్నారంటూ నిర్షక్ష్యపు సమాధానం చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అందుకే ఆందోళనలనున రాజకీయ ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. బోర్డు తప్పిదాలు కళ్లముందు కనిపిస్తున్నా, మార్చి పోతే సెప్టెంబర్ లేదా అన్నట్టు వ్వవహరిస్తున్నారు సదరు మంత్రి

సాంకేతిక లోపాలు విద్యార్థులకు శాపాలు

సాంకేతిక లోపాలు విద్యార్థులకు శాపాలు

ఇంటర్ విద్యార్థుల బాధలు వర్ణించలేకుండా ఉన్నాయి, సంవత్సరాలపాటు చదివి, మంచి మార్కులు తెచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల ఆందోళన బాట పట్టారు. బోర్డు వ్శఫలితాలు తారుమారు అయ్యాయి. బోర్డు లోని సాంకేతిక లోపంలో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోయారు.దీంతో పాస్ కావల్సిన వారు ఫెయిల్ అయ్యారు. అసలు పరీక్షలే రాయని వారు పాసయిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు 90 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మార్కుల మోమోల్లో 0 నుండి 9 మార్కులు వేసి చేతులు దులుపుకున్నారు అధికారులు.

మూడు రోజులుగా ఆందోళన చెందుతున్న విద్యార్థులు

మూడు రోజులుగా ఆందోళన చెందుతున్న విద్యార్థులు

తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా విద్యార్థులు, విద్యార్థుల సంఘాలు ఇంటర్ బోర్డువద్ద అందోళన చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించే బదులు ఇష్టనుసారం వ్వవహిస్తున్నారు. అసలు తప్పులే జరగలేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో పాటు బోర్డు వద్దుకు వెళ్లిన విద్యార్థును కనీసం పలకరించే పరిస్థితి కూడ లేదు. పైగా మద్దతుగా వెళ్లిన ప్రజా సంఘాల నాయకులను, పార్టీ నాయకులతో విద్యార్థి సంఘాల నాయకులు నిర్భంధంగా అరెస్ట్ చేస్తున్నారు. అయినా అన్యాయం జరిగిన విద్యార్థులు తమ గళం విప్పుతూనే ఉన్నారు.

గ్లోబరీనా సంస్థపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు మంత్రి

గ్లోబరీనా సంస్థపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు మంత్రి

అయితే ఇంత జరుగుతున్న తెలంగాణ విధ్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఇవ్వన్ని ఉహగానాలే అని కొట్టిపారేస్తున్నారు. ఈనేపథ్యంలోనే జరిగిన దానిపై ఎంక్యయిరి వేశామని చెబుతూనే , గ్లోబరీనా సంస్థపై పరీక్షలకు ముందునుండే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయంగా కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.కాగా విద్యార్థులు బాగా పరీక్షలు రాశామని భావించే విద్యార్థులు రీవ్యాల్యుయెషన్ అప్లై చేసుకోవాలని ఉచిత సలహ ఇచ్చారు. ఇవేమీ కాకుండా కొంతమంది చెబితే,విద్యార్థులు రాజకీయం చేయడం కరెక్టు కాదని అంటూన్నారు. అయితే చట్టప్రకారం తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఫెలయిన విద్యార్థులకు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా !

ఫెలయిన విద్యార్థులకు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా !

విద్యార్థులు ఫెలయితే ఆత్మహత్యులకు పాల్పడుతున్న విద్యార్థులపై సమాజంతోపాటు అన్ని రంగాలు ఆలోచించాలని అన్నారు. ఈనేపథ్యంలోనే పదవ తరగతి నుండి పీజీ వరకు కూడ విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని , దీంతో హత్మహత్యలు పాల్పడడం కరెక్టు కాదని సూచించిన ఆయన పరీక్షలను తిరిగి సంప్లిమెంటరీ లో రాసుకునే అవకాశం ఉందని ఓ మిడియా కు ఇచ్చిన ఇంటర్యూలో మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కోన్నారు.

English summary
Inter students agitation going on for inter board mistkes for last three days for their corrections, even though concern minister jagadeeshwar reddy giving neglect response on mistakes !
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X