హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎందుకు రాలేదు? పిలిస్తేగా వచ్చేది?: కేటీఆర్, ఈటల మధ్య మాటలు, రాజా‌సింగ్ డ్రెస్సుపై.!

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా కేటీఆర్ ఆయనతో సరదాగా మాట్లాడారు.

ఈటల, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

ఈటల, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

శుక్రవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ వద్దకు మంత్రి కేటీఆర్ వచ్చి మాట్లాడారు. ఈ సందర్బంగా పలు అంశాలపై సరదా సంభాషణ జరిగింది. ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఈటల ఇందుకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

ఇది పద్ధతి కాదంటూ కేటీఆర్‌కు ఈటల హితవు

ఇది పద్ధతి కాదంటూ కేటీఆర్‌కు ఈటల హితవు

ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని కేటీఆర్‌కు ఈటల రాజేందర్ హితవు పలికారు. వీరి మధ్య సంభాషణ జరుగుతుండగనే సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని భట్టి కూడా ప్రస్తావించారు. ఈటల కలుగ జేసుకుని కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు.

మీ షర్ట్ కలర్ నచ్చలేదన్న కేటీఆర్.! మీరూ వేసుకోవచ్చన్న రాజా సింగ్

మీ షర్ట్ కలర్ నచ్చలేదన్న కేటీఆర్.! మీరూ వేసుకోవచ్చన్న రాజా సింగ్

మరోవైపు, రాజా సింగ్, కేటీఆర్ మధ్య కూడా సరదా సంభాషణ చోటు చేసుకుంది. కాషాయ రంగు చొక్క వేసుకొచ్చిన రాజా సింగ్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందని, ఆ రంగు తనకు ఇష్టం ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా రాజా సింగ్ మాట్లాడుతూ.. కాషాయ రంగు చొక్కా భవిష్యత్తులో మీరూ వేసుకోవచ్చేమో అని రాజా సింగ్ సరదాగా స్పందించారు. ఈ క్రమంలో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్రమత్తం చేయడంతో.. ఆయన తన ట్రెజరీ బెంచీలవైపు వెళ్లిపోయారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా ఈటలతో ప్రత్యేక మాట్లాడారు.

English summary
Interesting talks between ktr and Etala Rajender, Raja singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X