హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయీం కేసులో జోక్యం చేసుకోండి...గవర్నర్‌కు లేఖ రాసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్.

|
Google Oneindia TeluguNews

రెండు దశాబ్ధాల పాటు నేర సామ్రాజ్యన్ని ఏలిన నయూం కేసుపై ఇంకా అనుమానాలు అవరోధాలు కల్గుతూనే ఉన్నాయి. నయీం పోలీసుల చేతిలో హతమై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా,నమోదైన కేసుల విచారణ అంతంతమాత్రమే ఉండగా బాధితులకు సరైన న్యాయం జరగడంలో కూడ జాప్యం జరుగుతుండడంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ స్పందించింది. కేసుకు సంబందించి పురోగతి వివరాలు తెలుపుతూ..గవర్నర్‌కు లేఖ రాశారు. సంబంధిత అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

నయీం హత్య జరిగి మూడు సంవత్సరాలు

నయీం హత్య జరిగి మూడు సంవత్సరాలు

రెండు దశాబ్దాలపాటు బెదిరింపులు.. సెటిల్‌మెంట్లతో వందల కోట్ల నేరసామ్రాజ్యం నయిమొద్దీన్‌ ఎన్‌కౌంటర్‌తో పతనమైంది. అతడి అనుచరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డంపులపై సోదాలు జరిపి కోట్లకొద్దీ కరెన్సీ, కిలోల కొద్ది బంగారం, వేల ఎకరాల భూములు, వందల సంఖ్యలో నివాస గృ హాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.. ఐ జీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృం దాన్ని ఏర్పాటు చేసి, వందలాది మంది బాధితుల నుంచి ఫిర్యాదులు, వాంగ్మూలాలు సేకరించారు.

కేసులపై సిట్ పురోగతి లేదని లేఖలో వివరణ

కేసులపై సిట్ పురోగతి లేదని లేఖలో వివరణ

మరోవైపు కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఎర్పాటు చేసిన నేపథ్యంలో నయీం కనుసన్నల్లో నేరాలకు పాల్పడిన కుటుంబ సభ్యులతో పాటు 124 మంది ముఖ్య అనుచరులను పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. నయీం హతమైన తర్వాత అతడి డెన్‌లల్లో సోదాలు చేసి 2కోట్ల 95లక్షల నగదు, కార్లు, బైక్‌లు, నివాసగృహాలు,1015 ఎకరాల పట్టా భూములు, లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాలకు సంబందించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. అతడికి స్వయంగా 27 హత్య కేసులతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించారు.

సత్వర న్యాయం చేకూర్చాలి...

సత్వర న్యాయం చేకూర్చాలి...


అయితే వాస్తవానికి నయీంకు చెందిన డెన్‌లలో వందల కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం దొరికినట్టుగా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. నయిం ఇంట్లో దోరికిన డబ్బను లెక్కించేందుకు క్యాష్ కౌంటింగ్ మిషన్లను కూడ ఉపయోగించారని కేవలం సుమారు మూడు కోట్ల డబ్బు కోసం మూడు క్యాష్ కౌంటింగ్ మిషన్లతో ఎందుకు కౌంటింగ్ చేస్తారని లేఖలో పేర్కోన్నారు. దీంతో గతంలో నయింపై అనేక కేసులు నమోదయి, విరమించుకున్నారని, ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత మళ్లి కేసులు నమోదు కావడం వెనుక పోలీసు అధికారుల హస్తం కూడ ఉందని వాటి వివరాలు ప్రభుత్వం బయట పెట్టడం లేదని లేఖలో పేర్కోన్నారు.ఈ నేపథ్యంలోనే గవర్నర్ జోక్యం చేసుకుని బాధితులకు సత్వర న్యాయం చేయాలని గవర్నర్‌కు కోరారు.

English summary
Center for Good Governance has written the letter to Governor for Intervene in the case of Naeem,Center for Good Governance written the letter to Governor on Naeem case for justise,నయీం కేసులో సత్వర న్యాయం చేయాలని కోరతూ గవర్నర్‌కు లేఖ రాసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X