హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లోకి చొరబడి, బెదిరించి... శంషాబాద్ లో దోపిడీ దొంగల హల్ చల్

|
Google Oneindia TeluguNews

దసరా పండుగ రానే వచ్చింది. పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వెళ్లడానికి వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు చాలామంది. ఇక ఇదే అదునుగా చూసి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచుకో వద్దని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దొంగలకు తాళం వేసి ఉన్న ఇళ్ళు మాత్రమే టార్గెట్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుడు మిస్సింగ్.. ఇంతకు ఏం జరిగిందంటే..!శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుడు మిస్సింగ్.. ఇంతకు ఏం జరిగిందంటే..!

నిన్న అర్ధరాత్రి శంషాబాద్ లోని చౌదరి గూడాలో ఇంట్లో మనుషులు ఉండగానే దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని చౌదరిగుడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బాలరాజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. ఇక అతనిని, అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. వారు చూస్తుండగానే దోపిడీకి పాల్పడ్డారు. బాలరాజు ఇంట్లో నుండి బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు దొంగలు.

Intruded into the house and threatened ... robbery in Shamshabad

ఈ దోపిడీలో మూడున్నర తులాల బంగారం, 45 తులాల వెండి, లక్షా 25 వేల రూపాయల నగదు దోచుకెళ్లిన ట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఎవరికి ఎలాంటి ప్రాణహాని చేయకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న పటికి, దోపిడి దొంగలు ఇల్లు గుల్ల చేయడంతో లబోదిబో మంటున్నారు బాలరాజు కుటుంబ సభ్యులు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇక ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఇళ్ళలో బంగారం, నగదు ఉంచవద్దని పోలీసులు చెప్తున్నారు.

English summary
Thieves have created a panic while they are at home in ChaudhariGuda in Shamshabad. At midnight in the Chaudariguda village of Shamshabad Zone in Rangareddy district, unidentified persons entered the house of Balaraj. He was threatened to kill him and his family members. While they were watching, the thieves were robbed. They looted gold, silver and cash from Balaraj's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X