హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదో వెరైటీ.. ఇప్పుడు కుక్కల ఛాలెంజ్.. నెట్టింట వైరల్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రైస్ ఛాలెంజ్, బకెట్ ఛాలెంజ్.. ఇలా ఎన్నో ఛాలెంజ్‌ల పేర్లు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కుక్కుల ఛాలెంజ్ నెట్టింట వైరల్‌గా మారింది. కుక్కలేంటి, ఛాలెంజ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. టిక్ టాక్ వీడియోల్లోనో, ఇతర యాప్స్‌లోనో తెగ సందడి చేసిన మనుషుల ఛాలెంజ్‌లు చివరకు కుక్కల దాకా వచ్చాయంతే.

సోషల్ మీడియాలో ఇలాంటి తెగ ఛాలెంజ్‌లు పుట్టించేటోళ్లు.. బోర్ అనుకున్నారో, లేదంటే టాపిక్ దొరకలేదో ఏమో గానీ ఇప్పుడు కుక్కల మీద పడ్డారు. దాంతో కుక్కల ఛాలెంజ్ అంటూ ఫోన్లు పట్టుకుని వాటి వెంట పడుతున్నారు. ఇన్‌విజిబుల్ ఛాలెంజ్ అంటూ దానికో పేరు పెట్టి తెగ హడావిడి చేస్తున్నారు. తాము పెంచుకునే కుక్కలను ఆట పట్టిస్తూ తీస్తున్న ఆ ఛాలెంజ్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

 Invisible Challenge for dogs is latest trend on Twitter

ఇంతకు ఆ కుక్కల ఛాలెంజ్ ఏంటంటే.. ఇంటి తలుపులకు కింది నుంచి కొంతమేర అడ్డంగా కాస్తా మందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్ అతికించాలి. దాని తర్వాత పెంపుడు కుక్కలు తమ వెంట పరుగులు పెట్టేలా చూడాలి. అలా ఆ పెట్ డాగ్స్ వారి వెంట పడుతుంటే తలుపులకు అడ్డుగా ఉన్న ప్లాస్టిక్ కవర్ వాటిని అక్కడే ఆపేస్తుందన్నమాట.

10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)

ఇక ఆ కుక్కల పరిస్థితి చూడాలి. వాటికి ఏమి అర్థం కాక అక్కడే ఆగిపోతాయి. ప్లాస్టిక్ కవర్ అడ్డుగా ఉండటంతో వాటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది వీడియో తీయాలి. అలా తీసిన వీడియోలను ఇన్‌విజిబుల్ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేయాలి. అదండీ నెట్టింట వైరల్‌గా మారిన కుక్కల ఛాలెంజ్ కహానీ.

English summary
After the bottle cap challenge, there is another challenge that is doing the rounds on social media. It is called the Invisible Challenge, and believe us when we say this, this is an adorable one. The challenge that became a sensation overnight has Twitter flooded with the app users tweeting videos of their dogs while they put transparent cellophane sheets in front of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X