హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లాక్ మార్కెట్ లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాకులో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యాప్రాల్ కు చెందిన వరుణ్, తుకారాంగేట్ కు చెందిన రంజిత్.. అసెంబ్లీ సమీపంలోని మెట్రో స్టేషన్లో ఈవెంట్స్ నౌ అనే సంస్థ కౌంటరులో బుకింగ్ క్లర్కులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి మల్కాజిగిరికి చెందిన రాహుల్ తోడయ్యాడు. ఇతడు అదే మెట్రో స్టేషన్లో కౌంటర్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు.

ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో "ట్రాప్".. యువతిని లొంగదీసుకుని వికృత చేష్టలు

IPL tickets in block market hyderabad task force arrested three people

ఈ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాకులో విక్రయించడం మొదలుపెట్టారు. మార్కెట్లో డిమాండ్ ప్రకారం ఒక్కో టికెట్ ను డబుల్ ధరకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు బృందం దాడి చేయడంతో వీరి గుట్టురట్టైంది. 37 వేల 500 రూపాయల నగదుతో పాటు 16 ఐపీఎల్ టికెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

English summary
IPL Match Tickets sold in block market. Hyderabad task force police arrested three persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X