హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసానికి సిద్ధమైనట్లేనా..! ప్రకటన ఎప్పుడో?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికలంటే అంతో ఇంతో వేడి ఉంటుంది. అలాంటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఒక రేంజ్ లో వేడెక్కించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పావులు కదిపిన ఈ కొడంగల్ బిడ్డ గులాబీ నేతలపై మాటల తూటాలు పేల్చారు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నీవు రెడీయా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలే మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో.. రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతున్నారా అనేది చర్చానీయాంశంగా మారింది.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. ఓటమిని అంగీకరిస్తూనే టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. మరోసారి అధికారం వచ్చిందని.. ప్రజలిచ్చిన లైసెన్స్ గా భావించొద్దని హితవు పలికారు. కానీ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. ఆపై మీడియా ముందుకు రాలేదు.

అందరూ తప్పుకుంటే ఈయన కూడా..!

అందరూ తప్పుకుంటే ఈయన కూడా..!

రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి మాటపై నిలబడతారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాటంటే మాటే అని.. రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నది ఆయనను దగ్గరగా చూసినవారు చెబుతున్న మాట. మరికొందరేమో దీన్ని ఖండిస్తున్నారు. ఇదివరకు రాజకీయ సన్యాసం మాటెత్తినోళ్లు చాలామందే ఉన్నారని.. వారంతా రాజకీయాల నుంచి తప్పుకుంటే రేవంత్ రెడ్డి కూడా తప్పుకుంటారని వాదిస్తున్నారు.

టీఆర్ఎస్ లో KTR నెంబర్ 2.. అధికారికంగా ప్రకటించిన KCR టీఆర్ఎస్ లో KTR నెంబర్ 2.. అధికారికంగా ప్రకటించిన KCR

రేవంత్ రెడ్డి పరిస్థితేంటి?

రేవంత్ రెడ్డి పరిస్థితేంటి?

చంద్రబాబు నాయుడు నమ్మిన బంటుగా టీడీపీలో కీ రోల్ పోషించిన రేవంత్ రెడ్డి.. తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల పేరి ట టీడీపీ, కాంగ్రెస్ ను జత చేసిన క్రెడిట్ రేవంత్ రెడ్డిదే. అయితే కొడంగల్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డికి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. చివరి నిమిషం వరకు గెలుస్తాడనుకున్న ఆయనకు పరాజయం ఎదురైంది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ప్రభావం వేరేలా ఉండేది. కానీ ఓడిపోయారు కదా నెక్స్ట్ ఏంటనేది ప్రశ్నార్థకమే.

బెల్లం చుట్టూ ఈగలు వాలుతాయన్నట్లుగా తయారైంది ప్రెజెంట్ సిట్యూవేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు చంద్రబాబు గానీ, అటు కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ రెడ్డిని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? పొలిటికల్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేదంటే ప్రజాసమస్యలపై గళమెత్తుతూ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడతారా అనేది చూడాలి.

కేసీఆర్ నిలబడ్డారా..! రేవంత్ కౌంటర్ ఇలానే ఉంటుందా?

కేసీఆర్ నిలబడ్డారా..! రేవంత్ కౌంటర్ ఇలానే ఉంటుందా?

రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదివరకు రాజకీయ సన్యాసం అంటూ ఏ ఒక్క నేతన్నా మాట మీద నిలబడ్డారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే యూ టర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తల తెగ నరుక్కుంటా అని చాలా సందర్భాల్లో గులాబీ అధినేత కేసీఆర్ అంటుండేవారు. తెలంగాణకు దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకుంటే తల నరుక్కుంటానని వ్యాఖ్యానించేవారు.

అలా ఎన్నోసార్లు కేసీఆర్ చెప్పినా.. ఏనాడు మాట మీద నిలబడలేదనేది విపక్షాల ఆరోపణ. సరిగ్గా ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి కౌంటర్ గా వాడుకునే ఛాన్సుందంటున్నారు కొందరు. ఒకవేళ టీఆర్ఎస్ నేతలు పదేపదే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసంపై మాట్లాడితే.. చివరకు ఆయన సమాధానం ఇలానే ఉండబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

 రాజ్యసభ ఇస్తారా? ఎంపీగా నిలబెడతారా?

రాజ్యసభ ఇస్తారా? ఎంపీగా నిలబెడతారా?

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి రాష్ట్రమంతటా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేసినా కూడా.. టీఆర్ఎస్ హవాను తట్టుకోలేకపోయారు. కారు ప్రభంజనంలో కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమి పాలయ్యారు. అయితే పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజాస్కందాలపై వేసుకుని పోరాడిన రేవంత్ రెడ్డిని ఢిల్లీ పెద్దలు గుర్తిస్తారా లేదా అన్నది చర్చానీయాంశంగా మారింది.

ఒకవేళ ఆయన శ్రమను అధిష్టానం గుర్తించినట్లయితే.. రాజ్యసభ ఇవ్వడమో లేదంటే ఎంపీగా గెలిపించుకోవడమో ఏదో ఒకటి కచ్చితంగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అలా ఆయన చట్టసభల్లో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అంతో ఇంతో మాట్లాడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయనేది మరో కోణం. మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

English summary
Telanganga Assembly Elections warmed up with congress working president revanth reddy words. i will drop from political career if i defeated and challenged to KTR that if you ready for that. The comment was once again turned into a hot topic. With TRS coming to power with a gigantic Majority, revanth reddy political drop comment going hot. Is he stay away from politics in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X