హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయంత్రం వర్షం పడిన వేళ... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కంపనీలకే పరిమితం కావాలి...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో ఇటివల కురిసిన వర్షాలతో అలర్ట్ అయిన పోలీసులు రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వర్షాకాలం కావడంతోపాటు రోడ్ల పైకి నీరు చేరి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఈనేపథ్యంలోనే వర్షం పడ్డ రోజు గంటకు 10 కిలోమీటర్లు కూడ కదలని పరిస్థితి.. రోడ్డుపై నీరు నిలవడంతోపాటు, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుని ఉంటుందో తెలియని పరిస్థితి..దీనికి తోడు కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లేందుకు ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్లమీదకు రావడంతో వేలాదిగా వాహానాలు నిలిచిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా లక్షలాదిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉండడంతో వారిపై దృష్టి సారించారు అధికారులు

Recommended Video

నగరంలో భారీ వర్షాలు .. పలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
సాయంత్రం 4 నుండి 6 మధ్యలో కార్యాలయాలకే పరిమితం కావాలి

సాయంత్రం 4 నుండి 6 మధ్యలో కార్యాలయాలకే పరిమితం కావాలి

ముఖ్యంగా సాయంత్రం 4 నుండి 6 గంటల సమయంలోనే అటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో ఉద్యోగులు పెద్ద మొత్తంలో తమ కార్యాలయాల నుండి ఇంటికి వెళుతుంటారు..ఇక ఈ సమయంలోనే వర్షం పడుతున్న పరిస్థితి కూడ ఉంటుంది.. వీరితో పాటు పెద్ద మొత్తంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బయటకు వస్తున్నారు.ఐటీ కారిడార్ లోని సాఫ్ట్‌వేర్ కంపనీల్లో సుమారు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. .. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో వీరంతా కార్లను వాడుతున్నారు. దీంతో హైటెక్ సిటి ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.. ఇలా వర్షాలు కనీసం 48 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు..వాటిలో కనీసం 25 రోజుల పాటు విపరీతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలో పోలీసులు ఉన్నారు..దీంతో ఆయా రోజుల్లో ట్రాఫిక్ నియంత్రించాలని భావిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ కంపనీలతో సమావేశం

సాఫ్ట్‌వేర్ కంపనీలతో సమావేశం


ఈ పరిస్థితిని నివారించేందుకు పోలీసుల తోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ నియంత్రలో భాగంగానే సాఫ్ట్‌వేర్ కంపనీల మేనేజ్‌మెంట్‌లతోపాటు నాస్కామ్,టీసీఎస్, కాగ్నీజెంట్, టెక్ మహీంద్ర తో పాటు పలు ఎన్జీవో ఆర్గనైజన్లతో మున్సిపల్ అధికారులు సమావేశం అయ్యారు. సాయంత్రం వేళ వర్షం పడుతున్న సమయంలో ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు రాకుండా చేయాలని అధికారులు ఆయా కంపనీలను కోరారు..దీన్ని అమలు చేయడం వల్ల కొంత ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని ఆశభావం వ్యక్తం చేశారు. ఇది దేశంలో ఎక్కడా లేదని హైదరాబాద్‌లో మొదటి సారిగా అమలు చేస్తున్నట్టు చెప్పారు..అయితే ఈ నిబంధనలో మహిళలతో పాటు అత్యవసరం ఉన్న ఉద్యోగులకు మినహాయింపును ఇవ్వనున్నారు.

యూటర్న్‌లు మూసి వేస్తున్న పోలీసులు

యూటర్న్‌లు మూసి వేస్తున్న పోలీసులు

ఇక వర్షాలు పడే రోజున ఇప్పటికే యూ టర్న్‌లను మూసివేస్తున్నారు. యూటర్న్‌ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మెయిన్ రోడ్డును తాకే చిన్న చిన్న గళ్లీల ట్రాఫిక్‌ కూడ డైవర్ట్ చేయడంతోపాటు మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు.. వాహానాదారులు ఒకే రూటులో తమ గమ్యానికి చేరుకోవడం ద్వార మొత్తం ట్రాఫిక్ అంతా మెయిన్ రోడ్లపై నిలిచిపోతుంది. వర్షాలు పడే రోజుతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్ల ట్రాఫిక్‌ను ఇతర రూట్లలోకి మళ్లించనున్నారు.దీంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

English summary
Employees of IT firms in Hyderabad would have to stay back in their offices for about an hour after office hours if it rains between 4 pm and 6 pm this monsoon.Municipal authorities believe this will help ease the gridlock traffic jams that one of the country’s fastest growing tech cities gets stuck in during heavy showers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X