హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో రేవంత్ రెడ్డికి అరుదైన ఘటన..! ఒక్క సారిగా భావోద్వేగానికి గురైన తమ్ముళ్లు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొందరు వ్యక్తులను, వారు చేసిన పనులను ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేము. వారు చేసిన మంచి పనులకు సంబందించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. అదే రాజకీయాల్లో ఐతే దాని తాలూకూ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి అచ్చం ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది.

దాంతో తేరుకోవడానికి ఆయనకు కాస్త సమయం పట్టినట్టు తెలుస్తోంది. పార్టీ మారినా టీడిపి కార్యకర్తలు చూపించిన అభిమానానికి రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్టు సమాచారం. పార్టీ మారిపోయి చాలా కాలం అవుతున్నప్పటికి రేవంత్ రెడ్డిని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో చూడగానే తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా కేరింతలు కొట్టినట్టు తెలుస్తోంది. కొంత మంది అభిమానులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి చేతులు పట్టుకుని ఆప్యాయంగా ఆహ్వానిదచింనట్టు తెలుస్తోంది.

It is a rare event for Revanth Reddy in NTR Trust Bhavan.!The cadre emotionally welcomed..!!

ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన రేవంత్ రెడ్డి భేటీ ముగించుకుని నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు చేరకున్నారు. అప్పటికే ట్రస్టు భవన్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు మొహరించారు. రేవంత్ రెడ్డి లోనకు అడుగు పెట్టగానే అక్కడే ఉన్న వందలాది మంది పార్టీ శ్రేణులు అన్నా అంటూ భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చాలామంది కార్యకర్తలు పోటీ పడ్డట్టు తెలుస్తోంది.

అయితే పార్టీ విడిచిపెట్టి రెండేళ్లు కావస్తున్నా తెలుగు తమ్ముళ్ల హృదయాలలో రేవంత్ రెడ్డి ఎంతటి చెరగని ముద్ర వేసుకున్నారోననే చర్చ జరుగుతోంది. కాగా జరుగుతున్న పరిణామానికి రేవంత్ రెడ్డి ఆశ్యర్యం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకున్నప్పుడు కూడా కార్యకర్తలు అంతే ఉత్సాహాన్ని, అభిమానాన్ని ప్రదర్శించేవారని రేవంత్ రెడ్డి గుర్తుచేసినట్టు సమాచారం. మొత్తానికి సుధీర్ఘ కాలం తర్వాత రేవంత్ రెడ్డి కి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో అనూహ్య అనుభవం ఎదురైనట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. టీడిపి ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వెళ్లిన రేవంత్ రెడ్ది కి ఈ అనుభవం ఉదురైనట్టు తెలుస్తోంది.

English summary
We can never forget some people and the things they have done. They will have memories of the good work they have done. In the same politics, its intensity is slightly higher. Malkajgiri Congress Party MP Revanth Reddy has been confronted with such an incident. It seems that he has a little time to get rid of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X