హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్‌రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావుపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలోని పారిశ్రామికవేత్తల్లో ప్రథమ స్థానంలో రామేశ్వర్ రావు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ మధ్యే రామేశ్వర్‌రావు మీడియా రంగంలోకి కూడా ప్రవేశించారు. పలు కంపెనీలకు అధినేతగా ఉన్న రామేశ్వర్‌రావుపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది.

IT raids on My home Rameshwar Rao..?

గురువారం ఉదయం హైటెక్ సిటీలోని రామేశ్వర్ రావు కార్యాలయం, హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో ఉన్న ఆయన నివాసంపై దాదాపు 100 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 3వేల కోట్లు వివిధ మార్గాల ద్వారా రాజకీయ పార్టీలకు బదిలీ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు రామేశ్వర్‌రావుతో పాటు మరో పారిశ్రామికవేత్త శ్రీనిరాజులకు 100 ఎకరాల ప్రభుత్వం భూమి 20శాతం ధరకే కేటాయించడంపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

English summary
News is making rounds that Incometax department raided the office and residence of a telangana top industrialist and MY Home group Rameshwar Rao. Over 100 IT officials raided his office in Hitech city and residence in Nandagiri hills, sources revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X