హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

|
Google Oneindia TeluguNews

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పాత్ర ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.

జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై విచారణను వచ్చే శుక్రవారానికి సికింద్రాబాద్ కోర్టు వాయిదా వేసింది. దీంతోపాటు 15 మంది బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కౌంటర్‌లో ఇప్పటికే పేర్కొన్నారు. 15 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని సికింద్రాబాద్‌ కోర్టు తెలిపింది.

jagat vikyat reddy preliminary bail petition adjourned

Recommended Video

VK Sasikala Released After 4 Years In Jail

భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావు అండ్ కోను కిడ్నాప్ చేశారు. కొన్ని గంటల్లోనే వారిని పోలీసులు కాపాడారు. తర్వాత భూమా అఖిలప్రియ పాత్ర బయటకు రావడంతో అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ సహా 15 మందికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు మాత్రం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా.. విచారణ వాయిదా పడింది.

English summary
ex minister bhuma akhila priya brother jagat vikyat reddy adjourned hearing on preliminary bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X