హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా... కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు హరీష్ రావు కుట్ర: జగ్గారెడ్డి తీవ్రవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

MLA Jaggareddy Became Fire On Harish Rao | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పైన కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులను హరీష్ రావు ఎండబెట్టారని ఆరోపించారు.

కేసీఆర్‌కు తెలియకుండా చేసి ఉంటారు

కేసీఆర్‌కు తెలియకుండా చేసి ఉంటారు

హరీష్ రావు చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర ఎండిపోయిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తాగునీటి కోసం మంజీర నీటిని ఎందుకు తరలించారని అడిగారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు.. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా చేసి ఉంటారని భావిస్తున్నానని చెప్పారు. అధికారులపై ఒత్తిడి చేసి ఆయన నియంతృత్వంగా వ్యవహారించారన్నారు. అర్ధరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేశారన్నారు.

హరీష్ రావే దోషి

హరీష్ రావే దోషి

ఈ దోపిడీ దోషి హరీష్ రావే తప్ప ముఖ్యమంత్రి కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. మంజీరా నీళ్లు ఉమ్మడి మెదక్ ప్రజలవి అన్నారు. ఆయన చేసిన పాపం మెదక్‌ జిల్లా ప్రజలకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు హరీష్ రావు తూట్లు పొడిచారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో హరీష్ రావు మెదక్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం సంగారెడ్డికి నీటి కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలన్నారు.

హరీష్ రావు తనను ఓడించేందుకు ప్రయత్నించారు

హరీష్ రావు తనను ఓడించేందుకు ప్రయత్నించారు


నీటి తరలింపు విషయం కేసీఆర్‌కు తెలిసి ఉంటే అందుకు ఒప్పుకొని ఉండేవారు కాదని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌కు చెడ్డపేరును తీసుకు వచ్చేలా ఈ నిర్ణయం ఉందన్నారు. హరీష్ నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఉందని తనకు అనుమానం ఉందన్నారు. ఇలాంటి విషయాలను అడుగుతాననే తనను ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నాలు చేశారన్నారు.

English summary
Sangareddy Congress MLA Jagga Reddy on Wednesday lashed out at Harish Rao and Praised CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X