హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాటి ఉద్యమ నేతలకు సిగ్గుందా ?రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా చనిపోయారా ? జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉద్యమ నేతలపై ఫైర్ అయ్యారు. యాభై రెండు రోజులపాటు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను విధుల చేసుకునేది లేదని తేల్చి చెపుతుంది. దీంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్టీసీ కార్మికులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన చెందారు. రాష్ట్ర విభజన తరువాత ఎంతో మేలు జరుగుతుందన్న ఆశతో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చారన్నారు. కార్మికుల డిమాండ్లు సమంజసమైనవని, ప్రాణనష్టం జరుగుతోందన్న ఆలోచనతో సమ్మె విరమించారని పేర్కొన్నారు.

ఈ నెల 28న తెలంగాణా క్యాబినెట్ భేటీ ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశంఈ నెల 28న తెలంగాణా క్యాబినెట్ భేటీ ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన జగ్గారెడ్డి

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన జగ్గారెడ్డి

ఆర్టీసీ కార్మికుల పరిస్థితి డోలాయమానంగా మారిన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరాలనుకుంటున్న ఉద్యోగులను ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ విధుల్లోకి తీసుకోమని ప్రకటించడాన్ని జగ్గా రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు . ‘ఆయన ఎవరు ప్రకటన చేయడానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో మంత్రులు లేరా, చనిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి, ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేవని అన్నారు.

తెలంగాణా లో ప్రజలు ఉండొద్దా అని మండిపడిన కాంగ్రెస్ నేత

తెలంగాణా లో ప్రజలు ఉండొద్దా అని మండిపడిన కాంగ్రెస్ నేత

తెలంగాణలో ఆకలి అవుతుందని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అలాగే నిరసన తెలిపే హక్కు కూడా లేదు అని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పాలన కొనసాగుతోందని, రాష్ట్రంలో అసలు ప్రజలు ఉండొద్దా అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి . రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా చనిపోయారా అంటూ నిప్పులు చెరిగారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ప్రైవేటు పరం చేసినా, భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రైవేటును రద్దు చేస్తామని జగ్గా రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా ఉద్యమంలో పని చేసిన నేతలంతా ఏమయ్యరని ప్రశ్న

తెలంగాణా ఉద్యమంలో పని చేసిన నేతలంతా ఏమయ్యరని ప్రశ్న


రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు లేఖలు రాస్తున్నానని, ఈ విషయాన్ని కూడా తమ పార్టీ పెద్దలకు లేఖలో వివరిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. వారంతా ఆర్టీసీ కార్మికుల పక్షాన ఎందుకు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణా ఉద్యమ నేతలకు సిగ్గుందా అని జగ్గా రెడ్డి ఆగ్రహం

తెలంగాణా ఉద్యమ నేతలకు సిగ్గుందా అని జగ్గా రెడ్డి ఆగ్రహం


తెలంగాణలో పరిస్థితి చూసి ఉద్యమ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. చక్రపాణి, అల్లం నారాయణ, కారం రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీఓ, టీజీఓ నేతలంతా ఎక్కడున్నారు అని నిలదీశారు. మీ అందరికీ చీము నెత్తురు లేదా, మీకు అసలు సిగ్గుందా అంటూ పరుషంగా మాట్లాడారు. ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారాఅంటూ మండిపడిన జగ్గా రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారా' అంటూ ధ్వజమెత్తారు.

 ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచికాదని సీఎం కేసీఆర్ కు హితవు చెప్పిన జగ్గారెడ్డి

ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచికాదని సీఎం కేసీఆర్ కు హితవు చెప్పిన జగ్గారెడ్డి

అదే విధంగా ‘సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పిన జగ్గా రెడ్డి ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదని పేర్కొన్నారు.. ఆర్టీసీని ఆదుకోవాలని డిమాండ్ చేశారు . ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు. పోలీసులు మీ చేతుల్లో ఉండవచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావని గుర్తు పెట్టుకోవాలి అంటూ జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టినందుకు చరిత్రహీనులుగా మిగిలిపోతారని జగ్గారెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులపట్ల మానవత్వంతో వ్యవహరించాలని జగ్గారెడ్డి కోరారు. ఇప్పటికే కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం గా చరిత్ర హీనంగా నిలిచిపోతుందని ఆయన దుయ్యబట్టారు.

English summary
Sangara Reddy MLA Jaggara Reddy has become a fire or shame of the leaders of the movement in view of the situation in Telangana. Chakrapani, Allam Narayana, Karam Ravinder Reddy, TNGO and TGO leaders are doing what ? he fired . Jagga Reddy,outraged on governmnet and rtc MD for not taking rtc workers again to thier jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X