బతుకమ్మ పాట: జాగృతి సాంగ్ రిలీజ్, వావ్ బాగుందన్న: కవిత
బతుకమ్మ.. పూల పండగ.. పూలనే కొలిచే ఈవ్. తెలంగాణ వైభవంగా జరుపుకుంటారు. ఏటా బతుకమ్మకు పాటలు రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. యూ ట్యూబ్ చానెల్స్, టీవీ చానెల్ వారు సాంగ్ చేస్తుంటారు. తెలంగాణ జాగృతి కూడా సాంగ్ చేస్తుంటుంది. కరోనా వల్ల గతేడాది బతుకమ్మ జోష్ లేకుండేది. కానీ ఈ సారి మళ్లీ బతుకమ్మకు ఆ కళ రానుంది.

అల్లిపూల వెన్నెల..
తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను తీశారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయగా.. ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కలిసి విడుదల చేశారు. అల్లిపూల వెన్నెల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రెహామాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. రకరకాల పువ్వులను పేర్చి... అమ్మవారిగా తలచి పూజిస్తూ.. ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు.

డాన్స్ వేస్తూ..
బతుకమ్మ పండగలో మరింత ప్రత్యేకం బతుకమ్మ పాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను విడుదల చేశారు. పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా.. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ అందించారు. బతుకమ్మ పాటకు ఆడుపడుచులు సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

పువ్వులనే అమ్మవారిగా కొలచి
తెలంగాణ ప్రాంతంలో మాత్రమే పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజిస్తుంటారు. గౌరమ్మ, బతుకమ్మ అంటూ అమ్మవార్లను పిలుచుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడకను నిర్వహిస్తారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ.. ఒక్కో అమ్మవారిగా పూజిస్తుంటారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు. తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. పల్లె నుంచి పట్టణం వరకు తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగుతుంటాయి.

వావ్..
బతుకమ్మ పాట గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. వర్ణభరితం, మాధుర్యసహితం, ఐక్యతకు ప్రతిరూపం అయిన బతుకమ్మ వచ్చేసింది అని కవిత పేర్కొన్నారు. అక్కచెల్లెళ్లలారా... బతుకమ్మపై ఏఆర్ రహమాన్, గౌతమ్ మీనన్ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మీతో పంచుకుంటున్నాను అంటూ తెలంగాణ స్త్రీ జనాన్ని ఉద్దేశించి వెల్లడించారు. 'అల్లిపూల వెన్నెల' అంటూ సాగే ఈ గీతాన్ని కవిత తెలంగాణ జాగృతి యూట్యూబ్ చానల్లో పంచుకున్నారు.