India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిగ్ బాస్-5 గెస్ట్ జక్కన్న..? కొత్తగా తెరపైకి రాజమౌళి పేరు, మరీ ఆర్ఆర్ఆర్ టీం..?

|
Google Oneindia TeluguNews

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్‌కు చేరుకుంది. రేపు సాయంత్రం విన్నర్‌ను ఆనౌన్స్ చేస్తారు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫైనల్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సినీ ప్రముఖులను గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తీసుకురానున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్, ఎన్టిఆర్, అలియా భట్ రాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇంతవరకు స్టార్ మా తెలుగు ధృవీకరించలేదు. దీంతో చీఫ్ గెస్ట్ ఎవరా అనే సందిగ్దం ఏర్పడింది.

 జక్కన్న

జక్కన్న

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రాబోతుందని సమాచారం. కానీ ఇప్పటివరకు స్టార్ మా రివిల్ చేయలేదు. రాజమౌళి కొత్త మూవీ.. ఆర్ఆర్ఆర్.. వచ్చేనెలలో విడుదల ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతనిని గెస్ట్‌గా పిలిచారని రూమర్స్ వస్తున్నాయి. అయితే చెర్రీ, తారక్, అలియా భట్‌తో కలిసి జక్కన్న వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఇవాళ రాత్రి లోపు క్లారిటీ రానుంది.

టాప్-5

టాప్-5

సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, మానస్, సిరి ఈ సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకోవడానికి టాప్-5 లిస్ట్‌లో ఉన్నారు. ఆదివారం 'బిగ్ బాస్ తెలుగు 5' గ్రాండ్ ఫినాలే విజేత ఎవరో తేలబోతోంది. సిరి, మానస్.. టాప్-3లో చోటు దక్కకపోవచ్చని సమాచారం. టాప్-3లో సన్నీ, శ్రీరామ చంద్ర, షణ్ముక్ ఉంటారని విశ్వసనీయ సమాచారం. వీరిలో షణ్ముక్ గేమ్ బాగా ఆడుతున్నారు. అతని ఫ్యాన్స్.. ఓట్లు బాగానే వేయడంతో విజేతగా నిలుస్తారని సమాచారం. ఇటు సన్నీ కూడా బాగానే ఆడుతున్నాడు. తొలి నుంచి ఫైట్ చేస్తూ.. నాగ్ చేత తిట్లు పడుతూ ఇప్పటివరకు వచ్చాడు.

 టైటిల్ ఎవరిదో

టైటిల్ ఎవరిదో

సన్నీ టైటిల్ గెలుస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ రేపు రాత్రి వరకు ఆగాల్సిందే. ఇక శ్రీరామ చంద్ర.. ఇతను కూడా పాటలు పాడుతూ బాగానే ఆడాడు. చాలా సందర్భాల్లో నాగార్జున కూడా సపోర్ట్ చేశారు. తాను ఒంటరినని చాలా సందర్భాల్లో చెప్పారు. నేనున్నా అంటూ నాగ్ భరోసా ఇచ్చారు. ఓట్లు కూడా బానే పడుతున్న.. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. టైటిల్ గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే గత వారం గాయం కావడంతో బిగ్ బాస్-5 ఫైనలిస్ట్‌గా నిలిచినా.. ఆడలేదనే బాధ అతనికి ఉంది. జనం కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు వేశారా అనే సందేహాం నెలకొంది. సో మొత్తానికి సన్నీ, షణ్ముక్, రామ్.. ముగ్గురిలో ఒకరు ఫైనలిస్ట్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.

English summary
jakkanna rajamouli may be bigg boss-5 chief guest sources said. charan, ntr, alia bhat also may come to show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X