హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జానారెడ్డి చెప్పిన నిజం..! కాంగ్రెస్ లో క‌ల‌వ‌రం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో భీష్ముడు లాంటి నాయ‌కుడు త‌మ ఓట‌మి ప‌ట్ల మేథోమ‌థ‌నం నిర్వ‌హించారు. నియోజ‌క వ‌రంగాల వారీగా త‌మ ఓట‌మికి పోస్టు మార్టం చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జానారెడ్డి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అందులో ఓ అంశం అంద‌రి ద్రుష్టినీ ఆకర్శిస్తోంది. ఎన్నికల ఫలితాలపై మిర్యాలగూడలో కాంగ్రెస్ స‌మీక్ష స‌మావేశం ఏర్పాటుచేసింది. న‌ల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి ఈ స‌మావేశానికి ముఖ్య నేత‌గా హాజ‌ర‌య్యారు. మిర్యాల గూడ నుంచి పోటీ చేసిన ఆర్‌.కృష్ణ‌య్య కూడా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా జానారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోకుండా సమష్టిగా గెలుపుకోసం కృషి చేయాల‌ని, రానున్న రోజుల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాలని అన్నారు. అయితే ఇదే వ్యాఖ్య‌ల‌కు సంబందించి ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చారం నిజ‌మేనా అనే సందేహాలు క‌లుగుతున్నాయి.

Jana Reddy told the truth ..! Worry about Congress .. !!

ముఖ్య‌మంత్రి రేసులో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ పెద్ద‌లు త‌మ గెలుపు కోసం కంటే, తమ కాంపిటీట‌ర్ల ఓట‌మికి ఎక్కువ కష్ట‌ప‌డ్డార‌ని పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇపుడు జానారెడ్డి నోటి నుంచే వ‌చ్చిన‌ మాట‌ల‌ను బ‌ట్టి అది నిజ‌మే న‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి.

వారు గెలిస్తే తాము సీఎం కాలేమ‌ని ఆ ఐదుగురు త‌మ‌కు కాంపిటీట‌ర్‌గా ఫీల‌వుతున్న వారిని ఓడించ‌డానికి శాయ‌శ్శ‌క్తులా క‌ష్ట‌పడ్డార‌న్న అపోహ‌కు జానా వ్యాఖ్య‌లు ఆజ్యం పోసిన‌ట్టు అయ్యాయి. బ‌హుశా ఆ మాట‌లు వాస్త‌వాలేమోన‌ని ఇపుడు అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇదే స‌మావేశంలో కేసీఆర్‌పై కూడా జానారెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ఎస్ గెలుపు డ‌బ్బు సంచుల గెలుపు అన్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఆ పార్టీ నేత‌లు విచ్చలవిడిగా నోట్లు పంచార‌ని ఆరోపించారు. కేసీఆర్‌ నోట్ల కట్టలే తమ ఓటమికి కారణమని జానా వాపోయారు. ఇక ఇలాంటి ప‌రిస్థితుల‌ను అదిగ‌మించి క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్లాల‌ని జానా పిలుపునివ్వ‌డం విశేషం.. !!

English summary
A review of the election results was held in Mirialalguda on election results. Janarreddy from Nalgonda district was the chief leader of the meeting. R. Krishnaiah also participated. Janarreddy made interesting comments on this occasion. He said that the party should try to work together for the sake of collective action against each other and to join the party in the coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X