హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై జనసేన నజర్ ... పొత్తులతోనైనా.. సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ !!

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఈసారి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇప్పటికే పేర్కొన్నారు. ఈరోజు జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు గా పేర్కొన్నారు. ఈసారి జిహెచ్ఎంసి చైర్మన్ పీఠాన్ని జనరల్ కోటాలో మహిళకు కేటాయించారు .

దుబ్బాక ఫలితాల జోష్ .. ఏపీలో బీజేపీకి బూస్ట్ .. బీజేపీకి ప్లస్ అయ్యే అంశాలివే !!దుబ్బాక ఫలితాల జోష్ .. ఏపీలో బీజేపీకి బూస్ట్ .. బీజేపీకి ప్లస్ అయ్యే అంశాలివే !!

50 డివిజన్ల పై ప్రధానంగా ఫోకస్ చెయ్యనున్న జనసేన

50 డివిజన్ల పై ప్రధానంగా ఫోకస్ చెయ్యనున్న జనసేన

జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు, పార్టీ నుండి బరిలోకి దిగాల్సిన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో తాము కూడా గట్టి పోటీ ఇవ్వాలని జనసేన కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసిలో జనసేన పార్టీకి 40 డివిజన్లలో 20 వేలకు పైగా సభ్యత్వాలు ఉండడంతో, జనసేన పార్టీకి పట్టు ఉన్న స్థానాలలో పోటీ చేయాలని జన సైన్యం భావిస్తోంది. మొత్తం 50 డివిజన్ల పై జనసేన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 గ్రేటర్ లో బీజేపీ జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తారా?

గ్రేటర్ లో బీజేపీ జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తారా?

ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఇవ్వడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డుతున్న సమయంలో, బీజేపీ జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తారా? లేక ఎవరికి వారు ఎన్నికల బరిలో ఒంటరి పోరాటం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి సంయుక్తంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్నాయి. అదేవిధంగా రానున్న ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో బీజేపీ, జనసేనల పొత్తు పై ఒక క్లారిటీ ఉంది.

పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది నిర్ణయం

పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది నిర్ణయం

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నిక లలో ఏపీ తరహాలో బిజెపి జనసేన పార్టీలు పొత్తును కొనసాగిస్తాయా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ జనసేన నేతలు, పొత్తుల విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దే తుది నిర్ణయమని వెల్లడించారు. ప్రస్తుతం అమరావతి లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎల్లుండి హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో, ఆయన వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.

Recommended Video

భారత్‌పై Barack Obama ప్రశంసలు.. 'A Promised Land' పుస్తకంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావన!
పొత్తులతో అయినా సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ

పొత్తులతో అయినా సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ

ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జనసేన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది . మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి సత్సంబంధాల కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురు కలిసి బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు . దీనిపై జనసేన నేతలు మాత్రం పొత్తులతో అయినా సింగిల్ గా అయినా ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అనటం జనసేన నేతల జోష్ కు నిదర్శనం .

English summary
Janasena party wants to give a tough fight in the GHMC elections this time. With the Janasena party having more than 20,000 members in 40 divisions in the GHMC, it focusing on 50 divisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X