హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనతా కర్ఫ్యూ తెలంగాణలో 24 గంటలు: బస్సులు, మెట్రో, ఎంఎంటీస్ సేవల రద్దు, కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం రోజు(మార్చి 22)న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలంతా సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు జనతా కర్ఫ్యూ పేరిట 14 గంటలపాటు దేశంలోని ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వారే ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 7 నుంచి రాత్రి 9గంల వరకు ప్రజలంతా తమ ఇళ్లల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.

24 గంటలపాటు జనతా కర్ఫ్యూ..

24 గంటలపాటు జనతా కర్ఫ్యూ..


ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ .. తెలంగాణలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ జనతా కర్ఫ్యూను పాటిద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలు మినహా అన్ని నిలిచిపోతాయన్నారు.

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు బంద్..

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు బంద్..

తెలంగాణ ఆర్సీ బస్సులు కూడా ఆదివారం రోజు తిరగవని కేసీఆర్ తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు రానీయమని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైళ్లు కూడా బంద్ చేస్తున్నామని తెలిపారు. అత్యవసరం ోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. అయితే, అవి ప్రయాణికులను ఎక్కించుకోవని స్పష్టం చేశారు. ఎక్కడైన వైద్య బృందం, పోలీసుల అవసరం కోసం ఈ రైళ్లు పనిచేయన్నారు. ఆదివారం మెట్రో రైళ్లు తిరగవని మెట్రో అధికారులు కూడా ప్రకటించారు.

అత్యవసరాలు మినహా..

అత్యవసరాలు మినహా..


వర్తక, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని సూచించారు. నిత్యావసరాలు, పాలు, మందులు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్, ఆస్పత్రులు వంటి అత్యవసర సేవలు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వాహనాలు రాకుండా ఒకటి రెండు రోజుల్లో ఆ మార్గాలను మూసివేస్తామని చెప్పారు.

ఎంఎంటీఎస్ రైళ్లూ పాక్షికమే..

ఎంఎంటీఎస్ రైళ్లూ పాక్షికమే..


జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం పరిమిత సంఖ్యలోనే ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. రైళ్లను పూర్తిగా రద్దు చేయకుండా.. 12 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నడుపుతామని చెప్పారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250కి పైగా ప్యాసింజర్ రైళ్లు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Janta curfew in telangana: tsrtc buses and metro, mmts trains cancelled on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X