హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు ఊరట .. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ..రేవంత్ కు షాక్

|
Google Oneindia TeluguNews

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు నేడు స్టే విధించింది. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారని, ఇక ఆ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. జీవో 111కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

 పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్ పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్

ఇక రేవంత్ రెడ్డి పిటిషన్ తో జాతీయ హరిత ట్రిబ్యునల్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్న వివాదాస్పద ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ ఆయన హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి కేటీఆర్ కు ఊరట కలిగిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ సర్కార్ కు,హెచ్ఎండిఎ, పి సి బి లకు నోటీసులు జారీ చేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే విధించడం రేవంత్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.

 Janwada farm house issue: relief to KTR .. high court stays on NGT orders is a shock to revanth

Recommended Video

Posani Krishna Murali Helps TV5 Reporter Manoj Kumar Family

ఇక ఈ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకపక్షంగా వ్యవహరించిందని మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా కక్షపూరిత పిటిషన్ అని ఆరోపించిన కేటీఆర్, నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జిటి నోటీసులు ఇవ్వడం దారుణమని, న్యాయపోరాటం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో హైకోర్టు నిర్ణయంతో కాస్త ఊరట లభించింది.

English summary
KTR has get a relief about the Janavada farmhouse controversy. The High Court today stayed the orders issued by the National Green Tribunal. Hearing the arguments of the two parties, the High Court rested on the orders of the National Green Tribunal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X