హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో సైనికుడి భూమికే రక్షణ లేదు .. బార్డర్‌లో ఉన్న జవాను ఆవేదన (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జై జవాన్ .. జై కిసాన్ ... ఇది దేశంలో ప్రముఖ నినాదం. కర్షకుడు శ్వేదంతో పంట పండుతుంది. సరిహద్దులో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు గస్తీ కాస్తుుంటాడు జవాన్లు. దేశంలో వీరిద్దరంటే మంచి పేరు. కానీ కొందరు అర్ధబలంతో రెచ్చిపోతున్నారు. రైతులే కాదు జవాన్ల భూములను కూడా వదలడం. కాదేది కబ్జాకు అనర్హం అంటున్నారు.

నెక్లెస్ రోడ్‌లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు ! నెక్లెస్ రోడ్‌లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !

జవాను భూమి కబ్జా ..

ఈ వీడియోలో కనిపిస్తున్న జవాన్ పేరు స్వామి. దేశ రక్షణ కోసం సరిహద్దులో గస్తీ కాస్తున్నాడు. కానీ బోర్డర్‌లో మాత్రం అతని కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. వినేందుకు కాస్త విడ్డూరంగా ఉన్న అక్షరాల నిజం. మీకు నమ్మకం లేకుంటే సరిహద్దుల నుంచి స్వామి చేసిన వీడియో చూసి ధ్రువీకరించుకొండి. ఇక విషయానికొస్తే .. స్వామి దేశం కోసం పోరాడుతుంటే .. ఇంటి వద్ద పేరెంట్స్ ఉంటున్నారు. ఇంతవరకు ఓకే కానీ .. వీరి స్వస్థలం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం. వీరికి ఆరు ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆంజనేయులు అనే కబ్జాకోరు కన్నుపడింది. ఇంకేముందు తనకు తెలిసిన విద్యతో ఆ భూమిని కబ్జా చేసేశాడు. ఆంజనేయులు దురాక్రమణపై స్వామి తల్లిదండ్రులు పోరాడిన ఫలితం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు ఆంజనేయులు నోట్లకట్టలను చల్లారు. దీంతో వారు తమ కళ్ల ముందు అన్యాయం జరుగుతున్న చూడలేని దృతరాష్ట్రులయ్యారు.

ఇదే అదను ...

ఇదే అదను ...

ఉన్న కుమారుడు సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. తమ జీవనాధారమైన పొలం కబ్జాకు గురవడాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. జరిగిన అన్యాయం గురించి స్వామితో చెబితే ... ఆయన కూడా ఏం చేయలేని పరిస్ధితి. ఆయన చేసేది జవాను విధి .. కాబట్టి సెలవు అంత త్వరగా రాదు. దీనికితోడు భూమి కోల్పోవడం చిన్న విషయం కాదు. దీంతో ఒక సెల్ఫీవీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సీఎం కేసీఆర్‌కు చేరాలని అందులో ప్రత్యేకంగా కోరారు. తన జీవనాధారమైన భూమిని తిరిగి ఇప్పించాలని విన్నవించారు. సరిహద్దులో దేశం కోసం అహోరాత్రులు, నిశీధి రాత్రుల్లో పోరాడుతున్న జవాను కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

25 ఏళ్లుగా సాగు ....

25 ఏళ్లుగా సాగు ....

తమ భూమిని 25 ఏళ్లుగా సాగు చేస్తున్నామని వీడియోలో స్వామి కోరారు. ఇన్నిరోజులు లేంది .. ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ మారుస్తారని ప్రశ్నించారు. దీనిపై తమ తల్లిదండ్రులు రెవెన్యూ అధికారులు ఆర్జీ పెట్టినా బుట్టదాఖలు చేశాడని వాపోయారు. పోలీసులు, మీడియాకు సమాచారం ఇద్దామని ప్రయత్నిస్తే చంపేస్తామని ఆంజనేయులు తన తల్లిందండ్రులను బెదిరిస్తున్నాడని ఆందోళన చెందారు. పట్టించుకోకపోవడంతో మనోవేదనకు గురై సెల్ఫీ వీడియో తీస్తున్నట్టు పేర్కొన్నారు. తమ భూమిని ఆంజనేయుులు కబ్జా చేశారని మీడియాకు తెలిపిన .. ఆయన మ్యానేజ్ చేశారని ఆరోపించారు. దీంతో తాను డ్యూటీ చేయాలా ? వద్దా ? ఇంటికొచ్చేయాలా ? అనే మీమాంసతో ఉన్నట్టు పేర్కొన్నారు. తమ భూమిని గద్దల్లా లాక్కున్నారని ... వెంటనే తమ భూమి తమకు ఇప్పిచాలని కోరుతున్నారు. ఈ వీడియో సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లి .. రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
Swami is the name of Jawan as seen in this video. He patrols the border for the defense of the country. But in Border his family was left unprotected. His hometown is the village of Tadvai Mandalam in Kamareddy district. They have six acres of land. Anjaan was called up. He had already been able to curse the earth with the knowledge that he knew before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X