హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలకపాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి': మళ్లీ మొదటికి కేసు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసు విచారణలో బంజారాహిల్స్ పోలీసులు ఆయన సతీమణి పద్మశ్రీ వాంగ్మూలాన్ని శుక్రవారం తీసుకున్నారు. జయరాం నివాసంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. న్యాయవాదుల సమక్షంలో బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తీసుకున్నారు. పద్మశ్రీ నుంచి జయరాం కంపెనీకి చెందిన డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు.

జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలక పాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి

జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలక పాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి

ఈ సందర్భంగా జయరాం హత్యపై అనుమానాలను పద్మశ్రీ పోలీసులకు వివరించారు. తన భర్త హత్యలో కుట్ర దాగి ఉందని, మేనకోడలు శిఖా చౌదరి కీలక సూత్రధారి అని అనుమానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నిందితుడు రాకేష్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని చెప్పారు. తన భర్త జయరాం ఉమనైజర్ అని ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని పద్మశ్రి అన్నారు. ఈ కేసును లోతుగా విచారించారన్నారు.

'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?''శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'

న్యాయం చేయాలని కోరారు

న్యాయం చేయాలని కోరారు

తన భర్త హత్య కేసులో ఏపీ ప్రభుత్వం చేయని న్యాయం తెలంగాణ ప్రభుత్వం చేయాలని పద్మశ్రీ కోరుతున్నారు. హత్యతో శిఖాచౌదరికి సంబంధం లేదని ఏపీ పోలీసులు తేల్చడం అన్యాయమని వాపోతున్నారు. విచారణలో పోలీసులు ప్రలోభాలకు లొంగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త హత్యకు శిఖాయే కీలకమని, రాకేశ్ రెడ్డి కేవలం పాత్రధారి కావొచ్చని, ఆయనపై కేసు రుద్దారని అనుమానిస్తున్నారు.

మళ్ళ మొదటికొచ్చిన కేసు

మళ్ళ మొదటికొచ్చిన కేసు

ఈ కేసు కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ బదలీ కావడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లే!. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. మరోవైపు, హత్య హైదరాబాదులో జరిగినందున కేసును హైదరాబాదుకు బదలీ చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి రాకేష్ రెడ్డి అని ప్రాథమికంగా తేలిందని నందిగామ పోలీసులు చెప్పారు. శిఖా చౌదరి పాత్రకు ఆధారాలు లేవన్నారు. కానీ పద్మశ్రీ వంటి వారు శిఖా చౌదరి వైపు వేలు చూపిస్తున్నారు. కేసును లోతుగా దర్యాఫ్తు చేయాలని పద్మశ్రీ కోరారు. ఈ నేపథ్యంలో కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లుగా భావించవచ్చు. హైదరాబాద్ పోలీసులు మళ్లీ మొదటి నుంచి విచారించనున్నారు.

కోర్టులో వారెంట్ దాఖలు

కోర్టులో వారెంట్ దాఖలు


ఇదిలా ఉండగా, రాకేశ్ రెడ్డిని తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో వారెంట్ దాఖలు చేశారు. వాచ్‌మెన్ శ్రీనివాస్, రాకేష్‌ను విచారణకు అప్పగించాలని ప్రిసన్ ట్రాన్సిట్ వారెంట్‌ను హైదరాబాద్ పోలీసులు దాఖలు చేశారు.

English summary
NRI Jayaram's wife Padmasree nail Shikha Chaudhary in husband's murder case. Banjara Hills police took her statement on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X