హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద సారును మరిచారా చిన్న సారూ.. తెలంగాణ సిద్దాంతకర్త జయంతి వేళ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ జాతిపితను మరచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారూను అప్పుడే మరచిపోయారా? తెలంగాణ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆచార్యుడిని అంత తొందరగా మరచిపోయారా? తెలంగాణకు దశదిశగా మారిన ప్రొఫెసర్ జయశంకరుడిని అలా తేలిగ్గా మరచిపోయారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన ఎలాంటిదో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు. టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో ఆయన సలహాలు, సూచనలు ఏ మేర పనిచేశాయో కూడా తెలుసు. రాష్ట్ర సాధనలో ఆయన పడ్డ తపన ఎలాంటిదో కూడా తెలుసు. అలాంటి ఆచార్యుడికి ఈనాడు ఎలాంటి గౌరవం దక్కుతుందన్నదే ఇక్కడ ప్రశ్న. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణ సిద్దాంతకర్తకు నివాళి

తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా నివాళులు అర్పించారు. ఆ క్రమంలో తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ట్విట్టర్ వేదికగా కూడా కేటీఆర్ నివాళులు అర్పించారు. "జయ శంకర్ సార్ యాదిలో!!.. పుట్టుక మీది..చావు మీది..బతుకు తెలంగాణది!!.. అంటూ ట్వీట్ చేశారు.

మామ ఇలాకాలో అల్లుడు గారు.. కేసీఆర్ డైరెక్షన్.. హరీష్ రావు యాక్షన్..!

 ఆచార్య జయశంకర్ సార్‌కు హరీష్ రావు నివాళి

ఆచార్య జయశంకర్ సార్‌కు హరీష్ రావు నివాళి

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్దించాక ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాట పటిమ, ఆయన పడ్డ తపనను ఎవరూ మరచిపోలేరని చెప్పుకొచ్చారు. ఆయన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహానుభావులని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్‌కు ఆయన వెన్నంటి ఉండి ఉద్యమాన్ని ఉరకలెత్తించారని గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ వాణిని సమగ్రంగా, సమర్థవంతంగా వినిపించడానికి ఆయన దగ్గరే పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడి జీవితం చరమాంకంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడిచారని తెలిపారు. ఆయన సజీవంగా లేకున్నా.. తెలంగాణ బిడ్డల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారని చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ వేదికగా కవిత నివాళి

తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సారుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. "తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పిన మహోపాధ్యాయులు, ఆజన్మాంతం తెలంగాణనే స్వప్నించి, శ్రమించిన కర్మయోగి తెలంగాణ దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు.. మహాత్మా మీరు చూపిన తోవలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు పునరంకితమవుతామని ట్వీట్ చేశారు.

ఢిల్లీలోనూ సార్ జయంతి వేడుకలు

ఢిల్లీలోనూ సార్ జయంతి వేడుకలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావుతో పాటు ఆ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా.. ఆయనది తరగని చరిత్ర అన్నారు నామా. ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకుని ప్రజాప్రతినిధులుగా ముందుకెళతామన్నారు.

<strong>కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్‌సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు</strong>కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్‌సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్య నేతలు ఎక్కడ.. కేసీఆర్ బిజీయా?

ముఖ్య నేతలు ఎక్కడ.. కేసీఆర్ బిజీయా?

టీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరే జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారని.. మిగతా వారంతా ఎక్కడున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్రమంలో సీఎం కేసీఆర్ కూడా సార్‌ను మరచిపోయినట్టున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మేడిగడ్డ పర్యటనలో బిజీగా ఉన్న కేసీఆర్.. ఎక్కడ కూడా జయశంకర్ సారుకు నివాళులు అర్పించిన దాఖలాలైతే కనిపించలేదని నెటిజన్లు కోడై కూస్తున్నారు. అప్పుడే తెలంగాణ జాతిపితను మరిచిపోతే ఎట్లా కేసీఆర్ సార్ అంటూ కామెంటుతున్నారు.

English summary
Every Telangana child knows what the late Prof. Jayashankar Sir was about to achieve in a separate state. Also aware of the extent to which his suggestions and spark the KCR movement. The question here is what honors such a professor today. CM KCR not mentioned his name on the occasion of Jayashankar sir Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X