హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ వార్త బీటెక్ స్టూడెంట్స్ కోసం: ఈ విద్యాసంవత్సరం నుంచి బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు..ఏంటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యకు కేరాఫ్‌గా మారిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో శభాష్ అనిపించుకుంటోంది. సాంకేతిక విద్యను అందించడంలో అత్యుత్తమ ప్రమాణాలను మెయిన్‌టెయిన్ చేస్తూ ఏటా నాణ్యమైన ఇంజినీర్లను దేశానికి ప్రపంచానికి అందిస్తోంది జేఎన్‌టీయూ. ఇప్పటికే ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎప్పటికప్పుడు సిలబస్‌లో కూడా కొత్త అంశాలను చేరుస్తూ సాంకేతికతను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందిస్తూ మన్ననలు పొందింది జేఎన్‌టీయూ. తాజాగా జేఎన్‌టీయూ బీటెక్‌ విభాగంలో కొత్తగా ఆరు కోర్సులను ప్రవేశపెట్టింది.

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్‌ ప్రపంచస్థాయిలో పేరుగాంచింది. సాంకేతిక విద్య అంటే జేఎన్‌టీయూ అన్నట్లుగా తయారైంది. ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలతో ముందుకు వస్తూ టెక్నాలజీ వాల్యూస్‌ను విద్యార్థుల్లో ఇనుమడింపజేస్తోంది. తాజాగా బీటెక్‌కు సంబంధించి ఈ విద్యాసంవత్సరం నుంచి అంటే 2020-21 నుంచే ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డైరెక్టొరేట్ ఆఫ్ అకాడెమిక్ మరియు ప్లానింగ్ భావిస్తోంది. కొత్త కోర్సులకు సంబంధించి జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల నుంచి ఏడు ప్రతిపాదనలు రాగా దీనిపై ఫిబ్రవరి 26న కమిటీ సమావేశం జరిగింది.

JNTU plans for six new courses in BTECH from 2020-21 Academic year

కమిటీ సూచనల మేరకు బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులకు ఆమోద ముద్ర వేశారు జేఎన్‌టీయూ వైస్ ఛాన్సెలర్. ఇక ఈ ఆరు కొత్త కోర్సులు ఏంటంటే... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్, డాటా సైన్స్, ఎల్ఓటీ, నెటవర్క్స్ , కంప్యూటర్ ఇంజినీరింగ్, మరియు సైబర్ సెక్యూరిటీ. కొత్తగా కోర్సులు ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ టెక్నికల్ ఇన్స్‌టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణా రెడ్డి. అదే సమయంలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను కూడా విస్మరించకూడదని చెప్పారు.

English summary
The directorate of academic and planning of Jawaharlal Nehru Technological University Hyderabad (JNTUH), on 28 February, introduced six new B.Tech. courses for the academic year 2020-21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X