• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

|

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమంగా కేసులు పెట్టి మీడియా, ప్రతినిధులను బెదిరించాలని చూడటం సరికాదని మండిపడ్డాయి. రవిప్రకాశ్‌పై కేసుల వేధింపులను ఆపాలని .. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించాయి. రవిప్రకాశ్‌పై కేసులను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు మంగళవారం ఇందిరాపార్క్ వద్ద రిలే నిరాహర దీక్ష చేపట్టాయి.

మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్‌బుక్ నుంచి బహుమానం కొట్టాడు

వేధింపులు సరికాదు ..

వేధింపులు సరికాదు ..

తెలుగు మీడియాను కొత్త పుంతలు తొక్కించిన విజనరీ రవిప్రకాశ్ అని గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తిని కేసుల పేరుతో బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై ప్రభుత్వ జులుం నశించాలని నినాదాలు చేశారు. తెలుగు మీడియాపై మాఫియా రాజ్యమేలుతుందని .. ఇది జర్నలిజానికి ప్రమాద ఘంటికలు మోగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడినా బెదిరిస్తున్నారని చెప్పారు. నయానో, భయానో బెదిరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పాలకులు చెప్పినట్టు వినేదీ జర్నలిజం కాదని .. మీడియా గొంతును నొక్కితే ప్రజలకు వాస్తవం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.

మరో బెంగాల్‌లా...

మరో బెంగాల్‌లా...

బెంగాల్‌లో మీడియా పరిస్థితి దారుణమని గుర్తుచేశారు. టీఎంసీ నేతల అరాచకానికి ప్రతినిధులు బలయ్యారని గుర్తుచేశారు. మరికొన్నాళ్లలో తెలంగాణ గడ్డపై కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వాస్తవానికి జర్నలిస్టులకు ఇవ్వాల్సిన హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోరని ... ప్రశ్నించిన వారిని కేసుల పేరుతో వేధిస్తారని మండిపడ్డారు. తమ అర్థ, అంగ బలం ఉపయోగించి మీడియా ప్రతినిధులను అణగదొక్కాలని చూడటం సరికాదన్నారు. రవిప్రకాశ్‌పై పెట్టిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఈ పోరాటం అంతం కాదని .. ఆరంభం మాత్రమేనని జర్నలిస్టు ప్రతినిధులు స్పష్టంచేశారు.

వాదనల పర్వం ..

వాదనల పర్వం ..

మరోవైపు రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు హైకోర్టును కోరారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని .. ఇప్పటికే పలువురితో చాటింగ్ చేశారని మొబైల్ ఫోన్ స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు. టీవీ9లో ఫోర్జరీకి సంబంధించి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని .. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు కావడంతో విచారణకు హాజరవుతున్నారని పోలీసుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. టీవీ9 లోగో అమ్మే ప్రయత్నం చేశారని .. తానే యాజమానిని చెప్తున్నారని తెలిపారు.

పరిధి దాటారు ..?

పరిధి దాటారు ..?

పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది దిల్జీత్ సింగ్ వినిపించారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం సరికాదన్నారు. కాపీరైట్ చట్టం ప్రకారం టీవీ9 లోగోపై రవిప్రకాశ్‌కే హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అంశంపై రవిప్రకాశ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించలేదని .. ఎన్సీఎల్టీలో విచారణలో పెండింగ్‌లో ఉండగా .. క్రిమినల్ కేసు ఎలా పెడతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు బెయిల్ ఇవ్వకుండా చేసి .. అరెస్ట్ చేయాలనే కుట్రతోనే సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే కథ అల్లుతున్నారని వివరించారు. బెయిల్ పిటిషన్‌పై ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణకు ఈ నెల 18కి వాయిదావేసింది.

English summary
Journalist unions have demanded withdrawal of cases against former TV9 CEO Ravi Prakash. It was a mistake to blame the media and the representatives of illegal cases. To stop the harassment of cases against Raviprakash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X