హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక మెట్రో రయ్.. రయ్... జూబ్లీహిల్స్...స్టేషన్ ఓపెన్

|
Google Oneindia TeluguNews

కారిడార్ -3 భాగంగా నిర్మాణం కొనసాగుతున్న అన్ని మెట్రో స్టేషన్లను అందుబాటలోకి తీసుకువచ్చారు మెట్రో అధికారులు. ఈనేథ్యంలోనే నాగోల్ నుండి హైటెక్ సిటికి వెల్లే కారిడార్ లోని పెండింగ్‌లో ఉన్న జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రోస్టేషన్‌ శనివారం ప్రారంభం కానుంది. ఈ కారిడార్‌లో మార్చి 20న మెట్రో ట్రైన్‌ను ప్రారంభించారు అధికారులు. అయితే ఈ కారీడార్‌లోని మొత్తం ఎనిమిది స్టేషన్లకు గాను అయిదు స్టేషన్లను ప్రారంభించారు.

సాంకేతిక కారణాలతో జూబ్లీహిల్స్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లను పెండింగ్‌లో పెట్టారు. కాగా గత రెండు నెలల నుండి ధురానగర్ , యూసుఫ్‌గూడ ,జూబ్లీహిల్స్ రోడ్‌నెం 5తోపాటు దుర్గంచెరువు, హైటెక్‌సిటి స్టేషన్లలలోనే ప్రయాణికులకు అవకాశాన్ని కల్పించారు. శనివారం మిగిలిన స్టేషన్లు జూబ్లీచెక్ పోస్ట్ తోపాటు పెద్దమ్మగుడి, మదాపూర్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే ప్రారంభించిన హైటెక్ సిటి రూటుతో సాఫ్ట్‌వేర్ కంపనీల ఉద్యోగులకు ఊరట లభించింది. ఇక మిగిలిన స్టేషన్లు కూడ అందుబాటులోకి వస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది.

jubilee check post metro station inagurated on saturday

కాగా మొత్తం మూడు రూట్లలోని 72 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణానికి పునాది వేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ప్రారంభం కానున్ననాగోల్ ,రాయదుర్గను కారిడార్ -భాగంగా నిర్మాణం చేశారు. ఈ కారీడార్ మొత్తం 27 కిలోమీటర్లకు గాను 23 మెట్రో స్టేషన్లను నిర్మించారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 65 కిలోమీటర్ల మేర మెట్రో పూర్తయినట్టు అధికారులు తెలిపారు.మరో కొ్ద్ది రోజుల్లో జేబిఎస్, ఎంజీబీఎస్ కారిడర్ కూడ ప్రారంభించనున్నట్టు సమాచారం.

English summary
jubilee check post metro station inagurated on saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X