హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్‌తో సేల్స్‌కు కిక్కు.. నెల్లూరు నుంచి అమ్మాయిలు.. ప్రముఖ ఫార్మా కంపెనీ బాగోతం బట్టబయలు..

|
Google Oneindia TeluguNews

కంపెనీ సేల్స్ పెంచుకోడానికి సెక్స్‌ను సాధనంగా వాడుకున్నారు.. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న అందమైన అమ్మాయిలను ఎరగా వేసి డాక్టర్లు, ప్రమోటర్లను లోబర్చుకోవాలనుకున్నారు.. కేవలం లాభాల కోసమే నైతిక విలువల్ని పక్కనపెట్టి నేరానికి పాల్పడ్డారు.. ఇది.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ బాగోతం. పోలీసులు గుట్టురట్టు చేసిన జూబ్లీ హిల్స్ రేవ్ పార్టీ వెనుక ఆ ఫార్మా కంపెనీయే ఉన్నట్లు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న జూబ్లీ హిల్స్ రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ పబ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి వెస్ట్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు. 22 మంది అమ్మాయిలతోపాటు ఇంకొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ రైడింగ్ జరిగిన సందర్భంలో సదరు మహిళలు ఎదురుతిరగడం, మీడియా ప్రతినిధులపైనా దాడికి యత్నించిన దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి.

వలపు వలలో డాక్టర్లు..

వలపు వలలో డాక్టర్లు..

ఆదివారం జూబ్లీ హిల్స్ పబ్ లో రేవ్ పార్టీ నిర్వహించింది ఓ ఫార్మా కంపెనీ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కంపెనీ సేల్స్ పెంచుకునేక్రమంలో డాక్టర్లు, ఇతర సిబ్బందికి పార్టీ ఏర్పాటు చేశారని, అందమైన అమ్మాయిలతో అశ్లీల డ్యాన్సులు, వ్యభిచారం చేయించారని వెల్లడైంది. పబ్ బుకింగ్ కూడా సదరు కంపెనీ పేరుమీదే జరిగినట్లు విచారణలో తేలింది.

ప్రసాద్ కోసం పోలీసుల వేట..

ప్రసాద్ కోసం పోలీసుల వేట..

జూబ్లీ హిల్స్ పబ్ లో రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ప్రసాద్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని అతనే మేనేజ్ చేశాడని, డాక్టర్లతో గడిపేందుకు అమ్మాయిలను రప్పించింది కూడా అతనేనని తెలుస్తోంది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అమ్మాయిలంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవాళ్లని, వారంతా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవాళ్లేనని వెస్ట్ జోన్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సిఉంది.

English summary
Hyderabad police suspect a pharma company behind the rave APs party held in a pub located at Jubilee hills. on Sunday night police raided the pub and rescued 22 women, who belongs to nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X