హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాకు పరిష్కారం ఉంది కానీ రోడ్డు ప్రమాదాలకే లేదు .. జూనియర్ ఎన్టీఆర్ ఆలోచింపజేసే వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

రహదారి భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ప్రజలను ఎంత చైతన్యవంతం చేసినా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతినిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు ఎంతోమంది ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను శోకసముద్రంలో ముంచేస్తున్నాయి . తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయి. అటువంటి రోడ్డు ప్రమాదాలపై జూనియర్ ఎన్టీఆర్ ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు.

వాట్సాప్ ,ఫేస్‌బుక్ లకు షాకిస్తూ సుప్రీం నోటీసులు .. మీ డబ్బు కంటే ప్రజల గోప్యతే ముఖ్యమని వ్యాఖ్యలు వాట్సాప్ ,ఫేస్‌బుక్ లకు షాకిస్తూ సుప్రీం నోటీసులు .. మీ డబ్బు కంటే ప్రజల గోప్యతే ముఖ్యమని వ్యాఖ్యలు

Recommended Video

#hyd #ntr రోడ్డు ప్రమాదంలో అన్న, నాన్నల్ని కోల్పోయిన బాధితుడిగా వచ్చా!-ఎన్టీఆర్ భావోద్వేగం
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్

జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా సైబరాబాద్ లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ అందరిని ఆలోచింపజేసేలా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ ఉంది కానీ రోడ్డు ప్రమాదాలకు ఎటువంటి పరిష్కారము లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రోడ్డు ప్రమాదంలో తన వాళ్ళను కోల్పోయానన్న జూనియర్ ఎన్టీఆర్

రోడ్డు ప్రమాదంలో తన వాళ్ళను కోల్పోయానన్న జూనియర్ ఎన్టీఆర్

రోడ్డు ప్రమాదంలో తన అన్న, తన తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు . 33 వేల కిలోమీటర్లు తాత గారైన ఎన్టీఆర్ పర్యటనలో ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్లిన మా నాన్న రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా మృతి చెందారని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన కోసం ఎదురు చూసే ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీకోసం మీ కుటుంబం కోసం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

నటుడిగా కాదు ఓ బాధితుడిగా వచ్చానన్న ఎన్టీఆర్

నటుడిగా కాదు ఓ బాధితుడిగా వచ్చానన్న ఎన్టీఆర్

రోడ్డు ప్రమాదాల గురించి యువతకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తాను నటుడిగా కాకుండా, ఓ బాధితుడిగా వచ్చా అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తన కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాయని ఎన్టీఆర్ చెప్పారు. మన దేశాన్ని పహారా కాస్తున్న సైనికులను, మన ఇంటి పక్కనే ఉండి పహారా కాస్తున్న పోలీసుల సేవలను అందరూ గుర్తించాలని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పౌరులుగా పోలీస్ డిపార్ట్మెంట్ ను గౌరవించాలని కోరిన ఆయన రోడ్డు ప్రమాదాల నివారణకు ఎవరికి వారే అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో నిత్యం 415 మంది దుర్మరణం .. ప్రపంచవ్యాప్త రోడ్డు ప్రమాద బాధితుల్లో 10% భారతీయులే

దేశంలో నిత్యం 415 మంది దుర్మరణం .. ప్రపంచవ్యాప్త రోడ్డు ప్రమాద బాధితుల్లో 10% భారతీయులే


దేశంలో నిత్యం 415 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని మొత్తం వాహనాల సంఖ్య ఒక శాతం వాహనాలు మాత్రమే భారత్లో ఉన్నాయని కానీ ప్రపంచవ్యాప్త రోడ్డు ప్రమాద బాధితుల్లో 10% భారతీయులని రోడ్డు భద్రతపై తాజా నివేదికలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు సైతం స్పష్టం చేసింది.

English summary
Junior NTR, who was involved in a program to educate the youth about road accidents, said that he was not an actor but a victim. NTR said the road accidents left a lasting grief in his family. He commented that there is a vaccine for the corona epidemic that has shaken the world but there is no solution to road accidents. Junior NTR said that We were advised to remember and be careful of the people in the house waiting for us when we leave the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X