హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఏ పాల్ సంచలనం: మందకృష్ణకు మంత్రి పదవీ, సేవకు గుర్తింపట..?

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి మంద కృష్ణ మాదిగకు ఆఫర్ ఇచ్చారు. అవును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మందకృష్ణ తనతో కలిసి పని చేయాలని కోరారు. అలా చేస్తే మంత్రిని చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. అందుకే అతనికి పదవీ ఇస్తానని ఆఫర్ చేశారు.

అంతేకాదు విద్యావంతులు తన పార్టీలో చేరాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయనని కామెంట్ చేశారు. తనకు 2012లో ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్‌ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అమిత్‌షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానని తనకు చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు. అయినా తాను తీసుకోలేదని చెప్పారు.

ka paul offered minister post to manda krishna madiga. he is eligible to the minister post.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ చోట్ల పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. అందుకే విద్యావంతులను తాను పిలుస్తున్నానని చెప్పారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అందులో భాగంగానే మందకృష్ణకు ఆఫర్ చేశారు. మరీ దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలీ.. ఊ అంటా ఊ ఊ అంటారా అనే సస్పెన్స్ మాత్రం ఉంది.

కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. అతను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఏకంగా మందకృష్ణకు మంత్రి పదవీని ఆఫర్ చేశారు.

English summary
ka paul offered minister post to manda krishna madiga. he is eligible to the minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X