హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీళ్లకే కన్నీళ్లు...ఎంత తల్లడిల్లిపోయిందో చిట్టితల్లి: పనిమనిషిగా తెచ్చి జీవచ్ఛవంలా మార్చారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం మరిచి చిన్నారిపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఈ కదిలించే ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

చిన్నారితో వెట్టిచాకిరీ చేయించిన తల్లిదండ్రులు

చిన్నారితో వెట్టిచాకిరీ చేయించిన తల్లిదండ్రులు

కాచిగూడలో నివాసముంటున్న గుజరాతీ దంపతులు తమకు ఆడపిల్ల లేదని ఓ బాలికను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నారు కానీ ఆ చిన్నారితో వెట్టి చాకిరీ చేయించారు. పేరుకు మాత్రం కూతురని చెప్పుకుంటూ ఆ పసిబిడ్డకు నరకం చూపించారు. చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో ఆ చిన్నారి అంతటి బాధను ఎలా ఓర్చుకుందో అనిపించేలా ఆ మూర్ఖులు ప్రవర్తించారు. ఏడేళ్ల వయస్సు ఉన్న బిడ్డ పడ్డ నరకయాతన పగవాడి బిడ్డకు కూడా రాకూడదని స్థానికులు చెప్పారు. చిన్నారిని హింసిస్తున్నారన్న విషయం కాచిగూడ పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు.

బాలల హక్కుల సంఘం జోక్యంతో విముక్తి

బాలల హక్కుల సంఘం జోక్యంతో విముక్తి

చిన్నారికి కర్కశ తల్లిదండ్రుల నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. బాలల హక్కుల సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని గత కొద్దిరోజులుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదు బాలల హక్కుల సంఘంకు అందడంతో వారు వెంటనే సమాచారంను కాచిగూడ పోలీసులకు చేరవేశారు. బాలల హక్కుల సంఘం చీఫ్ అచ్యుత రావు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ సందర్భంగా చిన్నారిని తాము దత్తత తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. అయితే చిన్నారి శరీరంపై గాయాల గురించి ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారు.

 చిన్నారి శరీరంపై ఎటు చూసినా గాయాలే..

చిన్నారి శరీరంపై ఎటు చూసినా గాయాలే..

చిన్నారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులను మహిపాల్ సింగ్ ఆశా కౌర్‌గా గుర్తించారు. అయితే ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కూతురు లేకపోవడంతో తాము దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఇక చిన్నారితో వెట్టి చాకిరీ చేయించేవారని పోలీసులు చెప్పారు. వయస్సుకు మించిన భారమైన పనిని చిన్నారితో చేయించేవారని పోలీసులు చెప్పారు. బాలిక పరిస్థితి చూసి పోలీసు అధికారులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులతో పాటు వారిద్దరి కొడుకులు కూడా బాలికను చితకబాదినట్లు విచారణలో వెల్లడైంది. శరీరంపై ఎటు చూసినా గాయాలే దర్శనమిచ్చాయి. చిన్నారి పెదవులపై కొరికారని, శరీరంపై ఇతర చోట్ల కూడా కొరికిన గాట్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఇక అన్నిటికంటే దారుణమైన విషయం చిన్నారి ముఖం కాలిపోయి కనిపించింది. అంతేకాదు అమ్మాయి ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేశారని పోలీసులు చెప్పారు. గాయాలు కనిపించాయని వెల్లడించారు.

 బాధను దిగమింగుకుంది తప్పా...

బాధను దిగమింగుకుంది తప్పా...


ఇంతగా చిత్రహింసలకు గురవుతున్నా ఆ బాధను తాను భరించిందే తప్ప ఎవరికైనా చెప్పాలనుకున్నా ఇంటిలోనుంచి బయటకు పంపేవారు కాదని విచారణలో వెల్లడైంది. భగవంతుడితో తప్ప ఆ చిన్నారి తను పొందుతున్న బాధను ఎవరితో చెప్పుకోలేకపోయింది. తనలో తానే నొప్పిని భరిస్తూ ఏడ్చిందని పోలీసులు చెప్పారు. ఇక ఈ కేసును తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం చీఫ్ అచ్యుతరావు తల్లిదండ్రులపై హత్యాయత్నం కేసుతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలాని డిమాండ్ చేశారు. ఈ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. భగవంతుడే బాలికి మొర విని కాపాడారని స్థానికులు చెప్పుకున్నారు.

English summary
Shock and anger have swept across Hyderabad after a seven-year-old girl was brutally abused, assaulted and tortured allegedly by her adoptive parents at Kacheguda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X