హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోంక్వారంటైన్లోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత: ఆ ఎమ్మెల్యే అభినందనలే కారణం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం హోంక్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వచ్చే ఐదు రోజులపాటు హోంక్వారంటైన్లోనే ఉండనున్నారు. ఈ మేరకు ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కూడా ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అయితే, మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో సంజయ్‌కి సోకినట్లు తేలింది.

 kalvakuntla kavitha in home quarantine after met mla sanjay kumar.

ఈ నేపథ్యంలోనే హోంక్వారంటైన్లో ఉండాలని కవిత నిర్ణయించుకున్నారు. ఐదురోజులపాటు పార్టీ శ్రేణులు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో కవిత ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం వాయిదా పడింది.

'నాకు రాపిడ్ టెస్టులో నెగిటివ్ రాగా.. ఆర్టీపీసీలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారు హోం ఐసోలేషన్‌తోపాటు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా ' అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనికి కవిత బదులిచ్చారు.

మీరు వేగంగా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇటీవలే మిమ్మల్ని కలిశాను. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వచ్చే ఐదు రోజులు నేను హోంక్వారంటైన్లోకి వెళ్తున్నట్లు కవిత వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసంలోనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 2,14,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
24,208 యాక్టివ్ కేసులున్నాయి. 1,89,351 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 1,233 మంది మరణించారు. తాజాగా, తెలంగాణలో 2275 కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. 2009 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 36 లక్షల పరీక్షలు నిర్వహించారు.

English summary
kalvakuntla kavitha in home quarantine after met mla sanjay kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X