హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్యాణ లక్ష్మికి ఎన్ని ఆటంకాలో..! చెక్కులేవి?.. వేల సంఖ్యలో పెండింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆషామాషీ కాదు. సవాలక్ష ఖర్చులుంటాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లంటే భారమే మరి. అందుకే అలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అంతా సవ్యంగానే జరుగుతున్నా.. ఇటీవల చెక్కుల పంపిణీలో ఆలస్యం జరుగుతుండటంతో లబ్ధిదారుల్లో నిరాశ మొదలైంది. ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు వస్తే ఆసరాగా ఉంటుందని భావించే తల్లిదండ్రులు చెక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థికసాయం ఆలస్యం.. లబ్ధిదారుల్లో నైరాశ్యం

ఆర్థికసాయం ఆలస్యం.. లబ్ధిదారుల్లో నైరాశ్యం


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇస్తున్న ఆర్థికసాయం లేట్ అవుతుండటంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు తనిఖీ చేసి అప్రూవ్ చేయాల్సిన అధికారులు ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండటంతో చెక్కుల పంపిణీ ఆగిపోయింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 2,43,785 దరఖాస్తులు వచ్చాయి. అందులో 1,60,456 దరఖాస్తులకు మోక్షం లభించి చెక్కులు రిలీజయ్యాయి. మరో 83,329 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

70వేలు పెండింగ్.. కొత్తవి సరేసరి

70వేలు పెండింగ్.. కొత్తవి సరేసరి

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు.. ఇలా అధికారుల సమయమంతా ఎన్నికల నిర్వహణతోనే సరిపోయింది. అందుకే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ పడ్డాయి. అయితే 83,329 దరఖాస్తులకు గాను ఆర్డీవోల వద్ద 607 పెండింగ్ లో ఉన్నాయి. ఇక దరఖాస్తుల పరిశీలన పూర్తయి ఆర్థికశాఖ ఆమోదం కోసం 3,991 ఆప్లికేషన్లు పంపించారు. మరో 5,922 దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా 70వేల పైచిలుకు దరఖాస్తులు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. వాటిని అధికారులు పరిశీలించెదెన్నడు.. వాటికి మోక్షం లభించేదెన్నడు అనే రీతిలో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.

 మరో 2-3 నెలలు ఆగాల్సిందేనా?

మరో 2-3 నెలలు ఆగాల్సిందేనా?

అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తంతు. రేపో మాపో షెడ్యూల్ విడుదలకానున్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీ అయిపోతారు. దానిమూలంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తుల పరిశీలన మరింత ఆలస్యం కానుంది. మరో రెండు నెలల వరకు చెక్కుల పంపిణీ జరుగుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇక ప్రాథమిక స్థాయిలోనే ఉన్న 70 వేల పై చిలుకు దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చి చేరే ఆప్లికేషన్ల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చినప్పటికీ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీకి ఇబ్బందేమీ ఉండదు. కానీ లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు ఇచ్చే ఛాన్స్ ఉండదు. దాంతో చెక్కుల పంపిణీ అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే వెరిఫికేషన్ స్టేజీలో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించాలంటే మాత్రం మరో రెండు మూడు నెలలు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

English summary
Some delay in issuing cheques of kalyana lakshmi and shadi mubarak scheme. Poor and Middle class parents were looking for those cheques. Government officials busy with election duties and some other works, so that the delay occured in issuing of cheques.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X