హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

disha murder: కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై కామారెడ్డి చైర్ పర్సన్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిశకు, ఆమె కుటుంబసభ్యులకు మధ్య మంచి సంబంధాలు లేవేమోనని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దిశకు తల్లిదండ్రులతో సఖ్య లేదంటూ..

దిశకు తల్లిదండ్రులతో సఖ్య లేదంటూ..

తల్లిదండ్రులతో దిశకు సఖ్యత లేని కారణాంగానే ఘటన జరిగిన రోజు ఆమె తన తల్లిదండ్రులకు కాకుండా తన సోదరికి ఫోన్ చేసిందని శోభ చెప్పారు. ఆమె తల్లిదండ్రులకు టచ్ లేనట్లుందని అన్నారు. గెజిటెడ్ ర్యాంకులో ఉన్న ఆమె ఆ సమయంలో తండ్రికి ఫోన్ చేయకుండా సోదరికి ఫోన్ చేయడమేంటని ప్రశ్నించారు.

ఆమె ధైర్యం కోల్పోయింది..

ఆమె ధైర్యం కోల్పోయింది..


మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా శిశు సంక్షేమ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. దిశ తల్లిదండ్రుల దగ్గర ధైర్యం కోల్పోయిందని.. అందుకే పేరెంట్స్ పిల్లలకు అన్ని నేర్పించాలని అన్నారు. పిల్లలను ప్రేమగా చూసుకోవాలని శోభ సూచించారు. పిల్లలకు ప్రేమ తగ్గించవద్దని తెలిపారు.

దిశ లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయంటూ..

దిశ లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయంటూ..


అంతేగాక, రాష్ట్రంలో దిశ లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎన్ని ఘటనలను అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ప్రతీది ప్రభుత్వంపై రుద్దితే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం ప్రతి ఆడపిల్లను ఎలా చూస్తుందని అన్నారు. కాగా, శోభ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని మండిపడుతున్నారు.

ఇటీవల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా..

ఇటీవల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా..

ఇటీవల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై వివాదాస్పద రీతిలో స్పందించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎన్‌కౌంటర్‌పై వల్ల నిందితుల తల్లిదండ్రులు ఎంత భాదపడ్డారో అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంధర్భంగా నిందితుల కుటుంబాలకు సైతం తాను ప్రగడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. తన నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓవైపు ప్రభుత్వం, పోలీసుల చర్యను ప్రజలు సమర్ధిస్తుంటే... మహిళ ఎమ్మెల్యేగా ఉండి నిందితులను సమర్ధిస్తారా.. అంటూ ఆమెపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దేశాన్ని కదిలించిన దిశ ఘటన

దేశాన్ని కదిలించిన దిశ ఘటన

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కదిలించింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దిశపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను ఉరితీయాలంటూ యావత్ దేశం డిమాండ్ చేసింది. అయితే, కేసు రీకన్‌స్ట్రక్చన్ కోసం పోలీసులు గత శుక్రవారం నిందితులను ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితులు పోలీసులపై దాడి చేసి తుపాకీలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివలు అక్కడికక్కడే హతమయ్యారు.

English summary
Kamareddy ZP chairperson Shobha controversial comments on disha murder incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X