కరాటే కళ్యాణి: అసభ్యకర, ఫ్రాంక్ కంటెంట్‌పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
కరాటే కళ్యాణి.. ఇటీవల యూట్యూబర్‌పై దాడి చేసి ఒక్కసారిగా వార్తల్లొకి వచ్చారు. ఆ అంశంపై రగడ కొనసాగింది. ఇప్పుడు మరోసారి ఆమె ఎవరిపై దాడి చేయలేదు.. కానీ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేసింది. అసభ్యకర ప్రాంక్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సదరు కంటెంట్ ఉన్న ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫ్రాంక్ పోరీలు.. గల్లీ బాయ్
శ్రీకాంత్ రెడ్డి నడిపే అసభ్యకర యూ ట్యూబ్ చానెల్ ఫ్రాంక్ పోరీలూ, గల్లి బాయ్ ఇంకా పలు ఛానెల్స్ ఉన్నాయి. ఇటీవల ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో గొడవపడిన ఆమె అతని గురించి పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ అసభ్యకర వీడియోలు చేస్తే సహించేది లేదని వారిపై పోరాటం చేస్తానని కళ్యాణి పేర్కోంది. అందులో భాగంగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో మరికొన్ని అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసింది.

వివరాలు అందజేత
సాక్ష్యాలతో సహా ఆమె సీసీఎస్ పోలీసులకు అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్ వివరాలు అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్స్‌పై ఐటీ యాక్ట్‌లో గల 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి యూట్యూబ్ అసభ్యకర చానెళ్లకు నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

లక్షల్లో నగదు
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్, యుట్యూబ్‌కు మాములు హైప్ లేదు. ఒక్కొక్కరు యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేయడం.. ఫేమస్ అయిపోవడం జరుగుతుంది. దాంతో వారు లక్షలకు లక్షల నగదు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఒకరిని లక్ష్యంగా చేసుకొని కంటెంట్ చేస్తున్నారు. అందులో ఫ్రాంక్ చేయడం సదరు వ్యక్తులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి కళ్యాణి గొడవ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె అతని యూట్యూబ్ చానెల్.. ఇతర చానెళ్లపై ఫిర్యాదు చేసింది.