• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కశ్మీర్ చిచ్చు పాకిస్తాన్‌తోనే కాదు.. ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య కూడా లొల్లి పెట్టేనా?

|

హైదరాబాద్ : ఆర్టికల్ 370 రద్దుకు జై కొట్టింది టీఆర్ఎస్ పార్టీ. బీజేపీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని కితాబిచ్చింది. డెబ్బై ఏళ్లలో జరగని పనిని ప్రధాని నరేంద్ర మోడీ చిటికెలో చేసి చూపించారని కొనియాడింది. ఇదంతా కూడా లోక్‌సభ సాక్షిగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు సపోర్ట్ చేసిన వైనం. అయితే బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీతో పరోక్ష దోస్తానా మెయిన్‌టెయిన్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ప్రకటించండం చర్చానీయాంశమైంది. అంతేకాదు ఈ వ్యవహారం ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య చిచ్చు రేపనుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ సపోర్ట్

ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ సపోర్ట్

ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో టీఆర్ఎస్ గళం వినిపించారు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ నామా నాగేశ్వరరావు. కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించే పార్టీల నేతలు దేశద్రోహులుగా మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తోందని ప్రకటించిన నామా.. ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. ఇవి చీకటి రోజులంటూ కొందరు వ్యాఖ్యానించడం సరికాదని.. ఇవి నిజంగా వికాసం వెదజల్లే రోజులని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వరా.. ఢిల్లీ పెద్దల తీరుపై రాష్ట్ర నేతల్లో తీవ్ర చర్చ..!

 మోడీని పొగుడుతూ నామా కితాబు

మోడీని పొగుడుతూ నామా కితాబు

ఎప్పటినుంచో నానుతున్న సమస్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిటికెలో సమాధానం చెప్పడం హర్షిందగ్గ విషయమని కొనియాడారు. మంచి జరగబోతుంటే కూడా చెడు జరుగుతున్నట్లు కొందరు ప్రచారం చేయడం తగదని ధ్వజమెత్తారు. కశ్మీర్ విభజన బిల్లుతో ఇక నుంచి అంతా మంచే జరుగుతుందన్నారు. అక్కడ పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. దాంతో కశ్మీర్ బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అందుకే ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. అక్కడ అభివృద్ధి జరగబోతున్న తరుణంలో అందరూ స్వాగతించాలే గానీ.. వ్యతిరేకించడం సరికాదన్నారు.

 ఇక్కడ ఎంఐఎం.. అక్కడ బీజేపీ.. క్యా బాత్ హై..!

ఇక్కడ ఎంఐఎం.. అక్కడ బీజేపీ.. క్యా బాత్ హై..!

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ నామా నాగేశ్వర రావు మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో ఎంఐఎంతో పరోక్ష పొత్తు కొనసాగిస్తూ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో కాస్తా కూస్తో లబ్ధి పొందిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీకి జై కొట్టడం చర్చానీయాంశమైంది. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తోందని నామా ప్రకటించడం హాట్ టాపికయింది.

అయితే లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం లైన్ మేరకే నామా మాట్లాడరా.. లేదంటే ఆయనే కాస్తా ఓపెన్ అయి అలా సెలవిచ్చారా అనేది కిందిస్థాయి పార్టీశ్రేణులు వ్యక్తం చేస్తున్న ప్రశ్న. రాష్ట్రంలో ఎంఐఎంతో జతకట్టి కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశంమేంటనేది అంతుచిక్కని వ్యవహారం అంటున్నారు మరికొందరు.

పారిశ్రామికవేత్త యాంగిల్‌లో మాట్లాడరా ఏంటి..!

పారిశ్రామికవేత్త యాంగిల్‌లో మాట్లాడరా ఏంటి..!

నామా నాగేశ్వర రావు స్వతహాగా పారిశ్రామికవేత్త.. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టే అవకాశం వస్తుంది. అయితే ఆయన కూడా పారిశ్రామికవేత్త కావడంతో రాబోయే రోజుల్లో కశ్మీర్‌లో పరిశ్రమలు, కంపెనీలు పెట్టడానికి బీజేపీ సపోర్ట్ కోసం అలా మాట్లాడి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

లోక్‌సభలో ఉద్విగ్నంగా మాట్లాడిన నామా.. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్ అంటూ మాట్లాడటం ద్వితీయ శ్రేణి నేతలకు కొత్త డౌట్ క్రియేట్ చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన బీజేపీకి మద్దతిచ్చారా.. లేదంటే ఆయన సొంత యాంగిల్‌లో కాస్తా ఓవర్‌గా రియాక్ట్ అయ్యారా అనే కోణంలో కొత్త చర్చకు దారి తీసింది.

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. 4 నెలల నుంచి అన్నీ కష్టాలే.. అందుకేనా రాజీనామాలు..!

 ఏమో ఏమవునో.. ఎంఐఎం, టీఆర్ఎస్ బంధం నిలిచేనా?

ఏమో ఏమవునో.. ఎంఐఎం, టీఆర్ఎస్ బంధం నిలిచేనా?

రాష్ట్రంలో ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ పరోక్ష దోస్తానా గురించి అందరికీ తెలిసిందే. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలో టీఆర్ఎస్‌కు మద్దతుగా మాట్లాడారు. అలా ఆ రెండు పార్టీల బంధం రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. అలాంటిది లోక్‌సభలో బీజేపీకి మద్దతిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ నామా మాట్లాడిన తీరు ప్రస్తుతం హాట్ టాపికయింది. ఇక్కడ ఎంఐంతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీకి సపోర్టా.. వారెవ్వా క్యా బాత్ హై అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆర్టికల్ 370 రద్దును ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తోందని లోక్‌సభలో ప్రకటించారు అసదుద్దీన్ ఒవైసీ. టీఆర్ఎస్ మద్దతిస్తోందని నామా నాగేశ్వర రావు ప్రకటించారు. అయితే కశ్మీర్ చిచ్చు దాయాదితోనే కాదు.. ఇప్పుడు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ మధ్య చిచ్చు పెట్టొచ్చేమోననే కామెంట్లు జోరందుకున్నాయి.

English summary
The TRS party has supported for the repeal of Article 370. The BJP's decision was courageous. Prime Minister Narendra Modi has at last been shown to do something that has not been done in seventy years. The TRS floor leader, Nama Nageshwara Rao appreciated in Lok Sabha. However, There is debate as to whether the relation between MIM and TRS is continue or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X