హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టికల్ 370, 35(ఏ) రద్దు.. న్యాయవాదుల సంబరాలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకోవడం విశేషం. ఆర్టికల్‌ 370 తో పాటు 35(ఏ) ను కూడా రద్దు చేస్తూ, రాష్ట్ర విభజన అంశాలను సైతం ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌లో అమల్లో ఉన్న ఆర్టికల్ 370, 35(ఏ) ను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాద ప్రకటన చేశారు. సభ్యుల ప్రతిఘటనల మధ్య బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు.

kashmir updates articles 370 35a ban hyderabad advocates celebrations

జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇంకొందరు వ్యతిరేకిస్తున్న సందర్భాలున్నాయి. అయితే చారిత్రక తప్పిదాన్ని బీజేపీ ప్రభుత్వం సరిదిద్దిందని.. ఇక జమ్ము కశ్మీర్‌కు మంచి రోజులు రానున్నట్లు
అరుణ్ జైట్లీ ప్రకటించారు.

kashmir updates articles 370 35a ban hyderabad advocates celebrations

జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఆ రెండు కీలక ఆర్టికల్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా తెలుగు రాష్ట్రాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో హైదరాబాద్ మల్కాజిగిరి కోర్టులో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని భారతమాతాకీ జై అంటూ నినదించారు. అటు రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.

అటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు కూడా సంబరాల్లో మునిగితేలారు. జాతీయ జెండాలు చేతబట్టి భారతమాతాకీ జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఒక హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అడ్వకేట్లు సంబరాలు చేసుకున్నారు.

అదలావుంటే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. ఆ క్రమంలో తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దాంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

kashmir updates articles 370 35a ban hyderabad advocates celebrations

అలాగే హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

English summary
In the case of Jammu and Kashmir, the two main articles 370, 35(A) have been canceled by the central government. The Advocates at the Malkajgiri court in Hyderabad celebrated the order. Bharat Mataki Jai shouted and shared sweets. The Rangareddy district court lawyers also celebrated. They welcomed the decision of the central government. Sharing sweets and indulging in celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X