హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా పథకాన్ని కాపీ కొట్టారన్న కవిత-కేటీఆర్: కానీ ఆ పొరపాటు చేయని నరేంద్ర మోడీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2019 : Ktr And Kavitha Comments on Union Budget 2019 | Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర నేతలు పలువురు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేప‌ట్టిన రైతుబంధు ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కాపీ కొట్టింద‌ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మా పథకాన్నే కాపీ కొట్టారు, కానీ

మా పథకాన్నే కాపీ కొట్టారు, కానీ

కేసీఆర్ రైతు బంధు స్కీమ్‌నే కేంద్రం కాపీ కొట్టింద‌ని, కానీ అది సరిగా లేదని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా ప్ర‌తి ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా.. ఒక్కో దఫాకు 5 వేల చొప్పున మొత్తం రూ.10వేలు ఇస్తుంటే, కేంద్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కంలో ఎక‌రాకు ఆరు వేలు కేటాయించిందన్నారు. మోడీ రైతు బంధును మ‌రింత రిఫైన్ చేయాల్సిన‌ అవ‌స‌రముందన్నారు. అయినా ఆ ప‌థ‌కాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. 33 శాతం మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ అంశాన్ని త‌మ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌న్నారు. క‌చ్చితంగా ఇది ఎల‌క్ష‌న్ బ‌డ్జెట్ అన్నారు. వేత‌న జీవుల‌కు ప‌న్ను మిన‌హాయింపులు కల్పించారని

వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?

 కాపీ కొట్టారని కేటీఆర్

కాపీ కొట్టారని కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధు పథకాన్ని పేరు మార్చి తెచ్చారని తెలిపారు.

కానీ చిన్న తేడా

కానీ చిన్న తేడా

అయితే, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తుంటే, కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద రూ.6 వేలు ఇస్తోంది. లబ్ధిదారుల (రైతు) ఎంపిక విషయంలో ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో ఎకరాల కొద్ది ఉన్న భూస్వాములు కూడా ఈ పథకం కింద వేలు, లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పొరపాటు లేకుండా జాగ్రత్త పడింది. అందుకే రెండు హెక్టార్లు.. అంటే ఐదు ఎకరాలు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింప చేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం పారదర్శకంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Telangana Rastra Samithi working president KT Rama Rao and Nizamabad MP Kalvakuntla Kavitha responded on Union Budget 2019. They said Centre copied theier Rathu Bandhu scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X