హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఇక కేసీఆర్ కూతురు కవిత ఓడిపోతే సీఎం కేసీఆర్ కనీసం ప్రెస్‌నోట్ కూడ విడుదల చేయలేదని, ముగ్గురు ఎమ్మెల్సిలు ఓడిపోయినప్పుడు కూడ మీడియా సమావేశం పెట్టలేని కేసీఆర్ ఉపఎన్నికల్లో గెలిచిన గంటసేపటికే మీడీయా సమావేశం నిర్వహించారని విమర్శించారు. ఇలాంటీ ఉప ఎన్నికలను ఎన్నో ప్రభుత్వాలు చూశాయని అన్నారు.

ఇక ఆర్టీసీ సమ్మెకు హుజుర్‌నగర్ ఎన్నికల ఫలితానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో గెలించేందుకు కులానికి, మతానికి ఓ నాయకున్ని పెట్టి కోట్ల రుపాయాలను ఖర్చు పెట్టారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు ఏవైనా ఉంటే పార్టీల పరంగా చూసుకోవాలి గాని, పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వలే కార్మికుల మీద కక్ష పెంచుకోవడం కరెక్టు కాదని అన్నారు. సీఎం ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేడు, అందుకే బీజేపీ ఉద్యమబాట పట్టిందని అన్నారు.

kcr also defeat like former cm Chandrababu Naidu

20 రోజులుగా కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక కేసీఆర్ రెచ్చగొట్టే మాటలకు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. భవిష్యత్‌లో కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

English summary
BJP state president Laxman has warned to CM KCR that kcr also defeat like former cm Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X