హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలు: నోటిఫికేషన్ రాగానే... ఇతర పార్టీల కంటే కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేడు (ఆదివారం) లోకసభ ఎన్నికలకు శంఖారావం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పదహారు మంది తెరాస అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్‌ ఒకేరోజు ప్రకటించనున్నారని తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆయన ప్రచార రంగంలోకి దిగనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన పేర్లు ప్రకటించారు.

సాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలసాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఒకేసారి 16 మంది అభ్యర్థుల ప్రకటన

ఒకేసారి 16 మంది అభ్యర్థుల ప్రకటన

తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌పై తెరాస ఆశలు పెట్టుకోలేదు. మిగతా 16 స్థానాల్లో కచ్చితంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అన్ని స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. నేడు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత రేపో, మాపో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

నోటిఫికేషన్ తర్వాత ఒకటి రెండు రోజుల్లో

నోటిఫికేషన్ తర్వాత ఒకటి రెండు రోజుల్లో

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ తర్వాత అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేయాలని కేసీఆర్ యోచించారు. ఈ నేపథ్యంలో నేడు నోటిఫికేషన్ జారీ కాగానే.. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థులను రంగంలో దింపడం ద్వారా ప్రచారంలోనూ ముందుండాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఆర్ఎస్ లోకసభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహాక సమావేశాలపై కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఈ సమావేశాలపై సంతృప్తికరంగా ఉన్నారు.

ఈసీ నోటిఫికేషన్ రాగానే ప్రచార రంగంలోకి కేసీఆర్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఒకటి, రెండు రోజులకు ఆయన ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. 16 లోకసభ నియోజకవర్గాల్లో 50కి పైగా సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. వేదికలను ఖరారు చేశారు. 16 లోకసభ స్థానాల్లో గెలిచి, ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్‌కు అండగా.. ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భావిస్తున్నారు. తమ థర్డ్ ఫ్రంట్‌లోకి జగన్‌ను తెరాస ఆహ్వానించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ స్థానాలను గెలిచి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు (వైసీపీ, తెరాస) కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి.

ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఒకటి, రెండు రోజులకు ఆయన ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. 16 లోకసభ నియోజకవర్గాల్లో 50కి పైగా సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. వేదికలను ఖరారు చేశారు. 16 లోకసభ స్థానాల్లో గెలిచి, ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్‌కు అండగా.. ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భావిస్తున్నారు. తమ థర్డ్ ఫ్రంట్‌లోకి జగన్‌ను తెరాస ఆహ్వానించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ స్థానాలను గెలిచి, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు (వైసీపీ, తెరాస) కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao to announce 16 Lok Sabha candidates at a time after releasing of Lok Sabha poll schedule by Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X