హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ జన్మదినం ఇక నుండి రైతు దినోత్సవం గా .. ఆసక్తికర ప్రకటన చేసిన తెలంగాణా మంత్రి

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ కు గ్రీన్ గిఫ్ట్ గా మొక్కలు నాటారు. పలు కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక నేడు సీఎం కేసీఆర్ జన్మ దినం సందర్భంగా వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర ప్రకటన చేశారు .

కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్ .. బద్ధ శత్రువులైన చంద్రబాబు, లోకేష్ లు కూడా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్ .. బద్ధ శత్రువులైన చంద్రబాబు, లోకేష్ లు కూడా

Recommended Video

#HappyBirthdayKCR: Gajwel People Gift To CM KCR | Oneindia Telugu
కేసీఆర్ బర్త్ డే .. రైతు దినోత్సవంగా చెయ్యాలని నిర్ణయించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ

కేసీఆర్ బర్త్ డే .. రైతు దినోత్సవంగా చెయ్యాలని నిర్ణయించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ

ఇకపై ప్రతి సంవత్సరం రైతు దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు . సీఎం కేసీఆర్ కు రైతులంటే ఎనలేని ప్రేమ అని చెప్పిన మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు . అందుకే కేసీఆర్ జన్మదినం రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించ తలపెట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

రైతుల కోసం రైతుబంధు తెచ్చి దేశానికే ఆదర్శం అయిన కేసీఆర్ అంటూ కొనియాడిన మంత్రి

రైతుల కోసం రైతుబంధు తెచ్చి దేశానికే ఆదర్శం అయిన కేసీఆర్ అంటూ కొనియాడిన మంత్రి

అయితే ఇప్పటికే జాతీయ రైతు దినోత్సవంగా డిసెంబర్ 23 న నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది . కేసీఆర్ పుట్టినరోజున రైతు దినోత్సవం చెయ్యాలని చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి నేడు సీఎం జన్మ దినాన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మాట్లాడారు. రైతుల కోసం రైతు బంధు పథకం తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

 కంది రైతులకు సీఎం భరోసా ఇచ్చారన్న వ్యవసాయ శాఖా మంత్రి

కంది రైతులకు సీఎం భరోసా ఇచ్చారన్న వ్యవసాయ శాఖా మంత్రి


కంది రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారని, కేంద్రం 47 వేల 500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని చెబితే.. తెలంగాణలో 2లక్షల మెట్రిక్‌ టన్నుల కంది ఉత్పత్తి అయ్యిందని , అయినప్పటికీ మొత్తం కందిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు . అయితే.. కొనుగోళ్ళలో దళారులకు సహకరించే ఉద్యోగులను జైలుకు పంపుతామని కూడా మంత్రి హెచ్చరించారు.

 మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగతమా, ప్రభుత్వ నిర్ణయమా ? సర్వత్రా ఆసక్తి

మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగతమా, ప్రభుత్వ నిర్ణయమా ? సర్వత్రా ఆసక్తి

మొత్తానికి మంత్రి వర్యుల స్వామి భక్తికి, వీరాభిమానానికి ప్రజలు అవాక్కవుతున్నారు. ఇప్పటికే రైతు దినోత్సవం ఉండగా తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా చెయ్యాలన్నది ఆయన నిర్ణయమా లేకా తెలంగాణా ప్రభుత్వ నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది . తెలంగాణా మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.

English summary
Telangana Chief Minister KCR's birthday today. Many celebrities greet him on the occasion of KCR's birthday. Birthday wishes to the KCR, which is a lofty enemy, says Chandrababu. Leaders and activists of the state are celebrating the birthday of Telangana CM KCR. KCR birthday celebrations will be held in Jalvihar. Many political and film personalities wish him well. agriculture minister niranjan reddy made interesting comments on this occasion . he mentioned that agriculture department decided that the KCR birthday celebrate as farmer day .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X