హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం .. కేంద్రానికి గత ఐదేళ్ళలో చెల్లించిన పన్ను ఎంతంటే !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లక్షల కోట్ల రూపాయల పన్ను కేంద్రానికి చెల్లిస్తుంటే వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఎక్కువ నిధులను కేంద్ర పన్నుల రూపేణా వసూలు చేస్తుంది కానీ రాష్ట్రాభివృద్ధికి కావలసిన నిధులను ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ఇబ్బందులు పెడుతోందని గత కొంతకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొంటున్న విషయం విదితమే.

యాదాద్రిలో కేసీఆర్ , కారు , సర్కారు చిత్రాల తొలగింపు ... ప్రతిపక్షాల ఆందోళనలకు చెక్యాదాద్రిలో కేసీఆర్ , కారు , సర్కారు చిత్రాల తొలగింపు ... ప్రతిపక్షాల ఆందోళనలకు చెక్

ఎంతోకాలంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శించడం తగదని ఆర్థిక సంఘాల సమావేశాలు, జిఎస్‌టి, ఆదాయం పన్ను శాఖ, నీతి అయోగ్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నా ప్రయోజనం కనపడడం లేదు. దేశంలో సమర్థత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రంగా ఉన్నప్పటికీ కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణాకు చేసిందేమీలేదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మంచి ఆదాయాన్ని కేంద్ర ఖజానాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. ఇక ఈ విషయాన్ని కెసిఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో తేటతెల్లం చేశారు.

KCR budget speech .. How much tax has the center paid in the last five years

ఇక ఈరోజు చేసిన బడ్జెట్ ప్రసంగంలో కెసిఆర్ కేంద్రానికి వివిధ రకాల పన్నుల రూపంలో తెలంగాణ గత ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 2,72,926 కోట్ల రూపాయల నిధులను పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించిందని వెల్లడించారు. ఈ నిధుల్లో కేంద్ర పథకాల అమలు కోసం తెలంగాణ రాష్ట్రానికి కేవలం రూ.31వేల కోట్లు వచ్చాయని సీఎం తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని, అందులోనూ ఓ సంవత్సరానికి అందే నిధులు కేంద్రం ఇప్పటివరకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.

English summary
Telangana has paid Rs.2.72 crores to central government in last five years . He was speaking on the introduction of the budget in the Assembly on Monday. Telangana has paid out Rs 2,72,926 crore to the Center in the form of taxes, according to figures confirmed by the central government. Telangana state has got only Rs.31 thousand crores for central goernment schemes implementation in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X