హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీపై పట్టు కోసం మెట్లు దిగుతున్న కేసీఆర్ .. మజ్లిస్ పార్టీతో మంతనాల ఆంతర్యం అదే!!

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఎన్నికల ఎఫెక్ట్ సీఎం కేసీఆర్ కు గట్టిగానే తగిలింది. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికలకు గులాబీ బాస్ కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎంఐఎం తో గతంలో స్నేహపూర్వకంగా పోటీ చేసిన కేసీఆర్, ఈసారి పొత్తులతోనే బరిలోకి దిగనున్నట్టుగా సమాచారం. దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావంతో బీజేపీ బలోపేతమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో, బిజెపికి చెక్ పెట్టడం కోసం సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీ నేతలతో మంతనాలు మొదలు పెట్టారు.

బల్దియా ఎన్నికల పొత్తులపై కేసీఆర్ తో మజ్లిస్ ఓవైసీ సమావేశం

బల్దియా ఎన్నికల పొత్తులపై కేసీఆర్ తో మజ్లిస్ ఓవైసీ సమావేశం

బల్దియా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాల గురించి ఇరువురు నేతలు సమావేశమై పలు కీలక అంశాలను చర్చించారు. నిన్న రాత్రి ఓవైసీ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ని కలిసి కీలక భేటీ నిర్వహించారు.

గ్రేటర్ ఎన్నికలపై పలు అంశాలపై చర్చించారు . దుబ్బాక ఎన్నికల ఫలితాలను బట్టి, జిహెచ్ఎంసి ఎన్నికలలో విజయకేతనం ఎగరవేయడం అంత ఈజీ కాదని భావిస్తూ కెసిఆర్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు మొదలు పెట్టారు.

ఎక్కువ సీట్ల కోసం మజ్లిస్ డిమాండ్ చేసే ఛాన్స్

ఎక్కువ సీట్ల కోసం మజ్లిస్ డిమాండ్ చేసే ఛాన్స్

హైదరాబాద్లో బలమైన ఓటు బ్యాంకు గల మజ్లిస్ పార్టీ గత ఎన్నికలలో కంటే అధిక సీట్లు పొత్తులో భాగంగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండటం, మొన్న దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం , అదే సమయంలో బీహార్లో మజ్లిస్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకొని తన బలాన్ని నిరూపించుకోవడం వంటి కారణాలు మజ్లిస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.

 పొత్తు కుదరాలంటే సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగక తప్పదా !

పొత్తు కుదరాలంటే సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగక తప్పదా !

దుబ్బాకలో ఓటమితో, సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో సీరియస్ గానే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీతో తప్పకుండా పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ తో భేటీ అయ్యారు . ఇరువురు నేతల మధ్య తొలి భేటీ జరిగింది. మరో రెండుమార్లు భేటీలు జరిగితే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీతో పొత్తు కుదరాలంటే సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగక తప్పదనే భావన వ్యక్తమవుతోంది.

గ్రేటర్ ఎన్నికలకు సమీపిస్తున్న సమయం .. కేసీఆర్ కీలక నిర్ణయాలు

గ్రేటర్ ఎన్నికలకు సమీపిస్తున్న సమయం .. కేసీఆర్ కీలక నిర్ణయాలు


దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే అధిక సీట్లను డిమాండ్ చేయడమే కాకుండా, నగర మేయర్ పదవి కూడా తమకు కావాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో వందకు పైగా స్థానాలు గెలుచుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఈ నెల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగనుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు.

English summary
Dubbaka's election effect hit CM KCR hard. With this, KCR, the pink boss for the GHMC elections, is entering the field himself and sharpening his tactics. KCR, which had previously contested amicably with MIM in the GHMC elections, is reportedly set to enter the ring with alliances this time. CM KCR Majlis has started talks with party leaders to give a check to the BJP in the wake of what it feels is that the BJP will be strengthened by the impact of the Dubbaka election results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X