హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భట్టి కళ్లు లేని కబోధి.. బుద్ది లేదు, కేసీఆర్ కామెంట్లపై విక్రమార్క మండిపాటు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్ మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. బడ్జెట్ కేటాయింపులపై కోత పెట్టడం ఏంటీ అని భట్టి అనడంతో సీఎం కేసీఆర్ ఒంటికాలిపై లేచారు. కేటాయింపులు తగ్గించింది తామే తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడగా .. భట్టి కూడా అందుకు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క : బడ్జెట్‌పై వాడీ వేడీ చర్చకేసీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క : బడ్జెట్‌పై వాడీ వేడీ చర్చ

చర్చ .. రచ్చ ...

చర్చ .. రచ్చ ...

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని .. వేల కోట్ల నిధులు మాత్రం ఖర్చవుతున్నాయని భట్టి అనడంతో కేసీఆర్ లేచారు. భట్టి కళ్లున్న కబోది అని .. బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. మిషన్ భగీరథ ద్వారా 56 లక్షల ఇళ్లకు నీళ్లిచ్చింది ప్రాజెక్టు కాదా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయతో 26 వేల చెరువులను పునరుద్ధరించిందని నిజం కాదా అని నిలదీశారు. మీ జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టు ఏడాదిలో పూర్తిచేయలేమా అని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి భట్టి కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

 కళ్లు లేని కబోది ..

కళ్లు లేని కబోది ..

తనను కళ్లు లేని కబోది, బుద్ధి లేదని అనడం సరికాదన్నారు భట్టి విక్రమార్క. తనకన్నా సీఎం కేసీఆర్ వయస్సులో పెద్ద అని .. గౌరవం ఉంచుకోవాలన్నారు. తాను సభా స్థానానికి, సీఎం కేసీఆర్‌‌ను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. తనకు సంస్కారం ఉందని .. అందుకే తాను నోరు జారనని స్పష్టంచేశారు. సభలో కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో తనకు కూడా అంతే ఉందని నొక్కి వక్కానించారు. ఈ సందర్భంలో భట్టి, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Recommended Video

Some TRS Leaders Are Trying To Jump Into BJP || అమిత్ షా సమక్షంలో TRS నేతలు BJPలో చేరనున్నారా...??
ఆన్ పార్లమెంటరీ పదం ...

ఆన్ పార్లమెంటరీ పదం ...

తర్వాత కేసీఆర్ మాటతీరుపై కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. ఆన్ పార్లమెంటరీ పదం వాడారని ఆరోపించారు. దీంతో కేసీఆర్ స్పందిస్తూ .. తనకు పార్లమెంటరీ పదం ఏంటో, ఆన్ పార్లమెంటరీ పదం ఏంటో తెలుసన్నారు. సభలో తప్పులను ఎత్తిచూపాలి కానీ .. నిజాలే చెప్పాలన్నారు. ప్రతిపక్షం కదా అని నోటికొచ్చింది చెప్తానంటే కుదరదని తాము ప్రొటెస్ట్ చేస్తామని తేల్చిచెప్పారు.

English summary
During the debate on the Telangana budget, Bhatti Vikramarka and CM KCR had a discussion. CM KCR lonely on the budget, saying that it is not a cut in the allocations. They have stated that the reduced allocations. During this time KCR spoke in his own style .. Bhatti also gave a counter attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X