హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Political Gossip: ఏపీ సర్కార్ బాటలో సీఎం కేసీఆర్.. ట్రెండ్ ఫాలో కానున్న తెలంగాణా సీఎం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఒకరినొకరు ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగిస్తున్నారు. ఏపీలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ బాటలో జగన్ నడుస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏపీ తరహాలో ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ జగన్ బాటలో నడుస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సైతం ఏపీ తరహా ఎక్సైజ్ పాలసీ ని తీసుకువచ్చి, సర్కారీ వైన్స్ నడిపితే 2000 కోట్లు ఆదాయం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠమున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ .. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

సర్కారీ వైన్స్ ఆలోచనలో సీఎం.. అధ్యయనానికి ఆదేశం

సర్కారీ వైన్స్ ఆలోచనలో సీఎం.. అధ్యయనానికి ఆదేశం


తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒక లెక్కలో చెప్పాలంటే ట్రెండ్ ఫాలోయర్ కాదు, ఆయన ట్రెండ్ సెట్టర్... అలాంటి కెసిఆర్ నిన్నగాక మొన్న సీఎం అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్నదానిపై ఆలోచనలో పడ్డారు. సర్కారీ వైన్స్ నిర్వహిస్తే అక్రమాలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అన్న కోణంలో ఆలోచిస్తున్న కేసీఆర్ ఇక దీనిపై అధ్యయనం చేయాలని ఎక్సైజ్ శాఖ ను ఆదేశించారు.

అధ్యయనం చేస్తున్న ఎక్సైజ్ శాఖ .. ప్రజాభిప్రాయసేకరణ

అధ్యయనం చేస్తున్న ఎక్సైజ్ శాఖ .. ప్రజాభిప్రాయసేకరణ

ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు నిర్వహిస్తే లాభాలు ఏ విధంగా ఉంటాయి ? ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు? అందులో ఉండే సాధకబాధకాలు ఏంటి ? ఇక దీని కోసం కొత్తగా నియామకాలు ఏమైనా చేపట్టాలా ? వంటి అనేక అంశాలపై అధ్యయనం చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారు సీఎం కేసీఆర్ . ఇప్పటికే దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం సమీక్ష నిర్వహించారు. దీనిపై అధ్యయనం ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రజాభిప్రాయ ఏ విధంగా ఉంటుంది అన్న ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.

ఇప్పటివరకు ఉన్న విధానంతో ఏటా 30వేలకోట్ల లావాదేవీలు

ఇప్పటివరకు ఉన్న విధానంతో ఏటా 30వేలకోట్ల లావాదేవీలు

అందుకే ప్రస్తుతం అమలవుతున్న మద్యం విధానాన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2216 మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల కాలానికి వీరికి మద్యం షాపులను అప్పగించిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు, దరఖాస్తు ఫీజులు, లైసెన్సు ఫీజులు, ఎక్సైజ్‌ డ్యూటీ, ఎక్సైజ్‌ టర్నోవర్‌ ట్యాక్స్‌ ఇలా అన్ని రకాలుగా ఏడాదికి రూ.30 వేల కోట్ల లావాదేవీలను సాగిస్తోంది. కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం ఉంటుంది.

స అదనంగా 2 వేల కోట్ల ఆదాయం ? .. వ్యతిరేకిస్తున్న కిందిస్థాయి సిబ్బంది

స అదనంగా 2 వేల కోట్ల ఆదాయం ? .. వ్యతిరేకిస్తున్న కిందిస్థాయి సిబ్బంది

ఒకవేళ ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే మరో రూ.2000 కోట్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే ఈ విధానానికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కింది స్థాయి అధికారులు మాత్రం ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహిస్తే ఆదాయం తగ్గుతుందని లెక్కలు చెబుతున్నారు. అలా చేస్తే దరఖాస్తు ఫీజుల రూపంలో వస్తున్న రూ.400 కోట్ల రాబడి పోతుందని ఎక్సైజ్‌ శాఖ కింది స్థాయి అధికారులు వివరిస్తున్నారు.

 సర్కారీ వైన్స్ నిర్వహణకే మొగ్గు చూపుతున్న సీఎం కేసీఆర్

సర్కారీ వైన్స్ నిర్వహణకే మొగ్గు చూపుతున్న సీఎం కేసీఆర్

ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ సర్కార్ సైతం ప్రభుత్వ మద్యం షాపులను నిర్వహించడానికి ఒక అడుగు ముందుకు వేసినట్లే అర్థమవుతుంది. త్వరితగతిన అధ్యయనం పూర్తి చేసి, లాభనష్టాలను బేరీజు వేసి నివేదిక అందజేస్తే సీఎం కేసీఆర్ సర్కారీ వైన్స్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలానే ఉన్నారు. దీంతో మద్యం షాపుల నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తుల ఆగడాలకు చెక్ పెట్టడమే కాకుండా, ఒక నిర్ణీత సమయంలో, క్రమపద్ధతిలో వైన్స్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

English summary
Telangana CM KCR is thinking about to run liquor shops by the government. He ordered the excise department and concern authorities to study the proposals of government liquor shops . the higher officials and the excise minister positively responded to the proposal of government liquor shops and they said that the government will gain additional 2000 crores of income by the govt liquor sales.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X