హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు.! 2వేల మందిని కొండపోచమ్మకు ఎలా తరలిస్తారన్న కాంగ్రెస్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొండ పోచమ్మ ప్రాజెక్టు ప్రారంబోత్సవ సందర్బంగా అనుసరించిన విధానాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరోనా క్లిష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలికి ఒదిలేసినట్టు సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహరించారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శన సందర్బంగా ముఖ్యమంత్రి సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఇక ప్రజలు ఎలా పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు టీపీసిసి నేతలు. ప్రజలకు ముఖ్యమంత్రి ఆదర్శప్రాయంగా ఉండాలని టీ పిసిసి కోశాధికారి, గుడూరు నారాయణ రెడ్డి హితవు పలికారు.

కేసీఆర్ స్వరంలో మార్పు.!కరోనా పట్ల భయం అవసరం లేదనే సంకేతాలు.!అందుకే ఆ వ్యాఖ్యలు.!కేసీఆర్ స్వరంలో మార్పు.!కరోనా పట్ల భయం అవసరం లేదనే సంకేతాలు.!అందుకే ఆ వ్యాఖ్యలు.!

కరోనా జాగ్రత్తలు లేకుండానే ప్రాజెక్టు ప్రారంభమా..? కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుబట్టిన టీపిసీసీ..

కరోనా జాగ్రత్తలు లేకుండానే ప్రాజెక్టు ప్రారంభమా..? కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుబట్టిన టీపిసీసీ..

కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తున్నా పరీక్షలకోసం ఇంతవరకూ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఎందుకివ్వడంలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. అంతే కాకుండా శుక్రవారం ముఖ్యమంత్రి 2000 మందితో కోండపోచమ్మకు వెల్లారని, కనీసం మొఖానికి మాస్కు కూడా పెట్టుకోలేదని నిలదీసారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు కరోనా పై ఏలాంటి సందేశం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత వరకు ప్రత్యేకత ఉన్న ఎపిడిమాలజిస్టునే నియమించలేదని టీ పిసిసి కోశాధికారి, గుడూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు.

ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించలేదు.. 2వేల మందిని ఎలా తరలిస్తారన్న కాంగ్రెస్..

ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించలేదు.. 2వేల మందిని ఎలా తరలిస్తారన్న కాంగ్రెస్..

సీఎం చంద్రశేఖర్ రావు ప్రజారోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాడని, కరోనా వైరస్ సాజిటీవ్ కేసులు ఈనెల 20నుంచి రోజు రోజుకు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ప్రయోగశాలల్లో పరీక్షలు చేస్తేనే ఇన్ని పాజిటివ్ కేసులొస్తున్నాయని, ఒకవేళ ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తోంది. ప్రభుత్వం ఖజానా నింపుకోవడాని మాత్రమే ఆలోచిస్తోంది తప్ప ప్రజల ప్రాణాల గూర్చి ఆలోచించడం లేదని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా చికిత్స చేసుకునే అవకాశం కల్పించంతో పాటు, ముఖ్యమంత్రి ఇతర దేశాలలో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణలో కూడా అమలు చేసి కరోనా కట్టడిచేయాలని నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.

గిరిజన రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఏం చేసారు.. సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్..

గిరిజన రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఏం చేసారు.. సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్..

అంతే కాకుండా గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 3 పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గులాబీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, సుఫ్రీంకోర్టు, హైకోర్టులో రిజర్వేషన్లు లేక పోవడంతోనే ఎస్సీ ఎస్టీ జడ్జీలు రావండ లేదని ఆవేదన వ్యక్తం చేసారు. జీవో నెంబర్ 3 ను సుఫ్రీంకోర్టులో కొట్టేసినా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని మండిపడ్డారు. 1956నుంచి ఆంధ్రలో లంబాడీ,సుగాలీలు ఎస్టీలుగా ఉన్నారని రాములు నాయక్ గుర్తు చేసారు.

వెనుకమడిన వర్గాలకు కేసీఆర్ ఏం చేసారో చెప్పాలి.. గులాబీ పార్టీ హామీలపట్ల నిలదీసిన రాములు నాయక్..

వెనుకమడిన వర్గాలకు కేసీఆర్ ఏం చేసారో చెప్పాలి.. గులాబీ పార్టీ హామీలపట్ల నిలదీసిన రాములు నాయక్..

స్వర్గీయ శ్రీమతి ఇంధిరా గాంధీ వల్ల గిరిజనులకు రిజర్వేషన్లు సిద్దించాయని, 1976 తర్వాత తెలంగాణలో ఇక్కడి లంబాడీలకు గిరిజన రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణ గిరిజనులకు ఏం చేసారని నిలదీసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చంద్రశేఖర్ రావు రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడెకరాభూమి, నిరు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, గిరిజన వర్శిటి ఇస్తామని హామీ ఇచ్చారని అవన్నీ ఇప్పుడు బుట్టదాఖలయ్యాయని రాములు నాయక్ ధ్వజమెత్తారు.

English summary
Telangana Congress Party vehemently opposes the policies adopted by the Telangana Chief Minister Chandrasekhar Rao on the occasion of the inauguration of the Konda Pochamma project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X