• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీ

|

దివంగత వైఎససార్ తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోందన్న వార్త తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ లో షర్మిల సోమవారం నల్గొండ జిల్లా వైఎస్సార్ అభిమానులతో భేటీ అయ్యారు. తెలంగాణ గడ్డపై తన ఎంట్రీ వెనకున్న లక్ష్యాన్ని మీడియాకు వివరించిన ఆమె.. పార్టీ స్థాపనపై త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. ఈ అంశంపై ఒక్క టీఆర్ఎస్ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ అధికారికంగా స్పందించాయి. వాటిలో తెలంగాణ బీజేపీ శాఖ మాత్రం పూర్తి భిన్నంగా, సంచలన రీతిలో తన స్పందన వెలువరించింది..

దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామదేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

కేవీపీ వల్లే షర్మిల ఎంట్రీ..

కేవీపీ వల్లే షర్మిల ఎంట్రీ..

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు.. వైఎస్సార్ ఆత్మగా పేరుపొందిన కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వల్లే షర్మిల కొత్త జెండాను ఎగరేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రస్తుతం సొంత పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, కేవలం తన కుర్చీని పదిలం చేసుకోడానికే కేసీఆర్.. తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని ప్రభాకర్ అన్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే..

షర్మిల పార్టీ గుట్టు విప్పిన రఘురామ -ఎన్టీఆర్‌లా జగన్ -అనిల్ బాణం -కర్ణాటక, తమిళనాడులో సక్సెస్షర్మిల పార్టీ గుట్టు విప్పిన రఘురామ -ఎన్టీఆర్‌లా జగన్ -అనిల్ బాణం -కర్ణాటక, తమిళనాడులో సక్సెస్

కేటీఆర్ ధిక్కారం.. ఈటెల పోట్లు..

కేటీఆర్ ధిక్కారం.. ఈటెల పోట్లు..

‘‘టీఆర్ఎస్ లో ముదిరిన అంతర్గత సంక్షోభం గురించి ఇటీవల ముఖ్యమంత్రి మాటల్లో కొంత వెల్లడైంది. కేసీఆర్ కారు కూతల్ని నమ్మే ఓపిక తెలంగాణ జనంలోనేకాదు, ఆయన సొంత పార్టీ నేతలకూ లేదు. మంత్రి కేటీఆర్ ను సీఎంగా ప్రకటించాల్సిందేనని భజనపరులు అదే పనిగా ఎదురుదాడి చేస్తూ, ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ లాంటి మంత్రుల మాటలు కూడా కేసీఆర్ కు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో కేసీఆర్ తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయారు. దాన్నుంచి బయటపడేందుకు చేస్తోన్న విశ్వప్రయత్నాల్లో భాగంగా..

మరో చంద్రబాబులా కేటీఆర్..

మరో చంద్రబాబులా కేటీఆర్..


కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి.. గతంలో ఎన్టీఆర్-చంద్రబాబు ఎపిసోడ్ లా తయారైందన్నది కాదనలేని వాస్తవం. కేసీఆర్ ఇంట్లోనే కుట్రలు జరుగుతున్నాయి. ఆయన సీఎం పదవి ఇకపై మూన్నాళ్ల ముచ్చటే. కొడుకు కేటీఆర్ మరో చంద్రబాబు అవతారం ఎత్తబోతున్నారనే భయం కేసీఆర్‌కి పట్టుకుంది. కేటీఆర్ మద్దతుదారుల ఒత్తిడిని తట్టుకోడానికే కేవీపీ సహకారం తీసుకున్నాడు. సొంతవాళ్లనే కాదు, గడిచిన ఏడేళ్లలో కేసీఆర్ ప్రజల జీవితాలతో పద్దతి ప్రకారంగా ఆటలు ఆడుకుంటూనే ఉన్నాడు. దీనిని ప్రశ్నించినందుకు..

ఎంఐఎంకు ఎమ్మెల్సీ ఆఫర్..

ఎంఐఎంకు ఎమ్మెల్సీ ఆఫర్..


సకల జనులను మోసగిస్తూ కేసీఆర్ సాగిస్తోన్న అరాచక పాలనను ప్రశ్నించిన కారణంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మొదలుకొని బీజేపీలోని చిన్న కార్యకర్తల వరకూ అందరిపైనా ప్రభుత్వం వేధింపులకు దిగుతోంది. చీటికీ మాటికి కేసులు పెట్టి హింసిస్తున్నారు. మరోవైపు అరాచకాలు సాగిస్తోన్న ఎంఐఎం పార్టీతో కేసీఆర్ అంటకాగుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ ఏకమయ్యాయి. మజ్లీస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతోంటే, టీఆర్ఎస్ ఒక్కదానిలోనే పోటీ చేసి, రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థిని పరోక్షంగా బలపరుస్తుండటం..

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు..

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు..


రాజకీయంగా కేసీఆర్ పతనం అయిపోయారనడానికి పైన చెప్పుకున్న కారణాలే నిదర్శనం. కేటీఆర్ సహా పలువురు మంత్రుల ఒత్తిడిని తట్టుకోలేక, టీఆర్ఎస్ లో పుట్టిన ముసలాన్ని అధిగమించేందుకు కేసీఆర్ ఓవైపు కమ్యూనిస్టులను కలుపుకుంటూ, మరోవైపు కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత కేవీపీతో కలిసి.. రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణంగా షర్మిల పార్టీని తెరపైకి తెచ్చారు. గతంలో ఎన్నోసార్లు సంక్షోభ సమయంలో కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. మరి ఇప్పుడు కూడా తెలంగాణలో మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా?'' అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు.

English summary
BJP vice-president NVSS Prabhakar said on Tuesday that YS Sharmila, sister of YSRCP president YS Jagan Mohan Reddy, is planning to launch her political party with the support of Chief Minister K Chandrashekar Rao. Addressing the media, Prabhakar stated that former Congress Rajya Sabha member KVP Ramachandra Rao had mediated between Sharmila and KCR.The CM wants presence of another political party in Telangana to come to power once again, he mentioned. Prabhakar said that launch of a new political party will not affect the BJP. People will not believe the gimmicks of KCR, he slammed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X