హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ మానస పుత్రికకు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రికకు అరుదైన గౌరవం లభించింది. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. దీని నిర్వహణకు సంబంధించి తెలంగాణ సాగునీటి శాఖ ఇంజనీర్లు ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ ఆహ్వానం పలకడం విశేషం.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో పాటు మరో రెండు పథకాలపై కూడా అంతర్జాతీయ సదస్సులో ప్రజంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ - నీటి వృధాను అరికట్టే పద్దతులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాలను వివరించాలని కోరింది.

kcr manasa putrika mission kakatiya holds international identity

అలా అలా "బంగారు తెలంగాణ" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?

ఇండోనేషియాలోని బాలిలో త్వరలో జరగనున్న ఈ సదస్సులో నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే ఆధ్వర్యంలోని బృందం ఈ మూడు అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు. అయితే తెలంగాణలో కీలకమైన మూడు పథకాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.

English summary
Telangana Irrigation Department holds International Identity. International Commission Irrigation and Drainage Institution Welcomes Telangana Irrigation Engineers to an Seminar to give Presentations about Mission Kakatiya, Nagarjuna Sagar Project and Sriram Sagar Project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X